దేశంలో సగం మందికి కరోనా….

ఏడాది చివరికి 67 కోట్ల మందిపై కరోనా ఉచ్చులో….

ప్రముఖ వైద్య సంస్థ నిమ్ హాన్స్ అంచనా ఇదే….

కోవిడ్ 19 లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచనలో ఉంది. కరోనా మహమ్మారిని దేశం సాక్ష్యంగా నిలవనుందనే వాదోపవాదనల్లో వైద్యులు, శాస్త్రవేత్తులు తలమునకలవుతున్నారు. కరోనా సోకిన రోగుల సంఖ్య పీక్స్ కు చేరిన తరువాతే …నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయనేది వారి వాదన…

జూలై నెల ప్రారంభంలో ఇండియాలో కరోనా పీక్స్ కు చేరుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంటే…ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం జూలై నెలాఖరుకు ఇండియాలో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది. అయితే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్స్ సంస్థ ప్రకారం సెప్టెంబర్ నాటికి కరోనా మహమ్మారి పీక్స్ కు చేరదని…కానీ దేశ ఆర్ధిక పరిస్థితిని 5 శాతం తగ్గించేస్తుందని అభిప్రాయపడింది.

ఈ నేపధ్యంలో ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును కొనసాగించేందుకు ్ఇండియా మాత్రం సంసిద్ధంగా ఉండాల్సిందే.

అయితే ేఇదే సందర్భంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్  అండ్ న్యూరోసైన్సెస్ …నిమ్ హాన్స్ ప్రకారం….లాక్ డౌన్ 4 అనంతరం ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతాయని…కమ్యూనిటీ ఫేజ్ లో ప్రవేశిస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 2020 చివరి నాటికి అంటే ఏడాది అంతమయ్యే సరికి దేశంలో సగం జనాభా కరోనా బారిన పడుతుందని అంచనా వేస్తోంది  నిమ్ హాన్స్. ఏడాది చివరికి ఏకంగా 67 కోట్ల మందికి కరోనా సోకవచ్చని అంచనా వేస్తోంది ఈ సంస్థ.

అయితే ఇందులో 90 శాతం మందికి కరోనా సోకిందనే విషయమే తెలియకపోవచ్చని….అధిక శాతం కేసులు ఏ లక్షణాాల్లేకుండానే ఉంటాయని నిమ్ హాన్స్ చెబుతోంది. కేవలం 5 శాతం మంది  పరిస్థితి మాత్రమే విషమంగా ఉండి…ఆసుపత్రుల్లో చేరవచ్చు. 67 కోట్లలో 5 శాతం మంది పరిస్థితి విషమమంటే.,..ఆ సంఖ్య దాదాపుగా 30 మిలియన్లుగా ఉండనుంది.

ఇప్పుడుున్న సవాలు ఒకటే…ఇాలాంటి పరిస్థితిని  ఎదుర్కొనేందుకు మనకు సరిపడినంత వైద్య సదుపాయాలున్నాయా లేవా అనేది. కోవిడ్ 19 రోగులకు చికిత్స అందించేందుకు దేశంలో ఇప్పటివరకూ కేవలం లక్షా 30 వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో  ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత తీవ్రం కావచ్చు. ఇప్పటికే  కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.

ఓ నివేదిక ప్రకారం….2019 మార్చ్ నాటికి గ్రామీణ భారతంలో కేవలం 16 వేల 613 ప్రైమరీ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 6 వేల 733 సెంటర్లలో మాత్రమే 24 గంటలు పనిచేస్తున్నాయి. 12 వేల 760 హెల్త్ సెంటర్లలో కేవలం 4 అంతకుమించి బెడ్స్ ఉన్నాయి. గ్రామీణ భారతంలో కేవలం 5 వేల 335 హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండటంతో కొరత తీవ్రంగానే ఉంది.

ఈ ఏడాది మే 16 నాటికి మొత్తం కరోనా కేసుల్లో 21 శాతం గ్రామీణ ప్రాంతాల్నించే ఉన్నట్టు తేలింది. దీన్ని పరిగణలో తీసుకుంటే…3న్నర కోట్ల మంది పరిస్థితి విషమంగా ఉండగా..అందులోంచి 70 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్నించే ఉంటారు. దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు గ్రామీణ భారతం కరోనాకు కొత్త హాట్ స్పాట్ గా మారుతుందని. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో లక్షలాది మంది మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.