కొనసాగమని హైకోర్టు చెప్పలేదు కదా…

లాజిక్ మిస్ అయిన నిమ్మగడ్డ….

ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది….

ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడి….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది.  ఏపీ ఎన్నికల కమీషనర్ గా వ్యవహరించిన రమేష్ కుమారా్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇప్పుడు మరోసారి సంచలనమైన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టు తీర్పు పూర్తిగా చదవకుండానే నిమ్మగడ్డతో సహా అందరూ తొందరపడుతున్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సాక్షాత్తూ  ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.

హైకోర్టు గానీ…నిమ్మగడ్డ గానీ ప్రదానంగా లాజిక్ మిస్  అయినట్టు అర్ధమవుతోంది.  ఏపీ అడ్వకేట్ జనరల్ వెల్లడించిన సారాంశం వింటే ఇదే తెలుస్తుంది.  ఏపీ ఎన్నికల కమీషనర్ గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టివేసింది. ఇంతవరకూ నిజమే. అయితే అదే తీర్పులో నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా కొనసాగించమని కూడా చెప్పింది హైకోర్టు. మరి అభ్యంతరం ఏంటంటారా….

హైకోర్టు నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా కొనసాగమని చెప్పలేదు. అంటే ఇవాళ రమేష్ కుమార్ తనకు తానుగా ఎన్నికల కమీషనర్ బాధ్యతలు తీసుకున్నట్టు ప్రకటించడం, పలు సర్కులర్ లు విడుదల చేయడం తొేందరపాటు చర్యనే అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడించారు. ఎందుకంటే హైకోర్టు నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా కొనసాగించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది తప్ప….తనకు తానుగా ప్రకటించుకోమని నిమ్మగడ్డకు చెప్పలేదు. తీర్పులో కూడా వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు అభ్యంతరమవుతోంది.

ఇక రెండోది 1994 పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 200 ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి  వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమించవచ్చు. అయితే హైకోర్టు తాాజా ఉత్తర్వుల్లో భాగంగా ఆ ఆధికారం రాష్ట్రానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ లేదు.  అదే సమయంలో ఎన్నికల కమీషనర్ అర్హతను నిర్ణయిచే అర్ఙత కూడా రాష్ట్రానికి లేదు. మరోవైపు గవర్నర్ తన అధికారాల్ని సమీక్షించే క్రమంలో మంత్రుల లేదా ముఖ్యమంత్రి సలహాల్ని, సిఫార్సుల్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడిదే కొత్త పరిణామాలు దారి తీస్తోంది. ఆ అధికారం గానీ, ఆ పరిధి గానీ రాష్ట్రానికి లేనప్పుడు….గవర్నర్ పాటించాల్సిన అవసరం లేనప్పుడు ఇదే ప్రొవిజన్ నిమ్మగడ్డు రమేష్ కుమార్ నియామకం విషయంలో కూడా వర్తించడం సహజమేనని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అంటున్నారు.  ఎందుకంటే ఏదైనా చట్టం వచ్చినప్పుడు గతానికి…వర్తమానానికీ వర్తిస్తుందన్నారు.  గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి బిశ్వాస్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించవచ్చని సిఫార్సు చేశారు. ఓ నెల తరువాత నిమ్మగడ్డను నియామకంపై సిఫార్సు చేశారు.  ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు సిఫార్సులు గానీ…నిమ్మగడ్డ నియామకం కూడా తప్పేనని శ్రీరామ్ చెప్పారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

మరోవైపు ఈ వ్యవహారంలో  ఏపీ, ఎస్ఈసీ,  వివాదంలో హైకోర్టు తీర్పు అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా విడుదల చేసిన సర్క్యులర్లు పై  సైతం ఏజీ శ్రీరామ్  అభ్యంతరం తెలిపారు.  నిమ్మగడ్డ పై హైకోర్టు తీర్పు వెలువడిన కాస్సేపటికే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తున్నందుున అంతవరకూ స్టే ఇవ్వాలని కోరుతూ పిటీషన్ కూడా దాఖలు చేశామన్నారు. అయినా సరే తొందరపడి రమేష్ కుమార్ సర్కులర్ లు విడుదల చేశారన్నారు. 

అందుకే కచ్చితంగా ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

for vedio version:

 

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.