సామాన్యుడిపై పెట్రో బాంబు…కరోనా ఎఫెక్ట్

లాక్ డౌన్ అనంతరం లీటర్ కు 5 రూపాయలు పెంపు…

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆలోచన….

లాక్ డౌన్ తో కరోనా ఏ మేరకు నియంత్రించబడిందో గానీ…లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం ధరలు మాత్రం గూబగుయ్యిమన్పించనున్నాయి. లాక్ డౌన్   అనంతరం భారీగా పెట్రో ధరలు పెరగనున్నాయి. వాహనదారులకు కచ్చితంగా ఇది షాకింగ్ న్యూస్. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర 5 రూపాయల వరకూ కచ్చితంగా పెరగనుందని తెలుస్తోంది. జూన్ లో లాక్ డౌన్ తొలగించిన తరువాత పెట్రోలియం కంపెనీలు ఎప్పటిలానే తిరిగి రోజువారీ సమీక్ష ప్రకారం ధరల్ని నిర్ణయించనున్నాయి.  ఈ సమీక్షలో భాగంగానే ధరలు ఒక్కసారిగా పెరగవచ్చు.

లాక్ డౌన్ అనంతర పరిస్థితి సమీక్షించడానికి …ఏరోజు కారోజు ఇంధన ధరల పెంపుపై తగిన ప్రణాళిక రూపొందించడానికి గత వారమే ఇంధన రిటైలర్లు సమావేశమయ్యారు.  ఒకవేళ లాక్ డౌన్ 5 ప్రకటించినా సరే…రోజువారీ ధరల సమీక్ష మాత్రం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతమైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఖర్చు కంటే తక్కువకే పెట్రోలియం విక్రయిస్తోంది. దాంతో భారీగా నష్టం మూటగట్టుకుంటుందని ఆ కంపెనీల అంచనా. ధరల సమీక్షకు ప్రభుత్వం అనుమతి ఇస్తే …ఈ నష్టాల్నించి గట్టెక్కడానికి యోచిస్తున్నాయి. కంపెనీలు. మార్కెట్ నిర్ణయించిన ధరలకే అమ్మకాలకు సైతం ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొనుగోలు, విక్రయాల మధ్య అంతరం 5 రూపాయల వరకూ ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో పెరుగుదల లేదు కాబట్టి…రోజుకు 40-50 పైసలు లీటర్ కు పెంచుకుంటూ పోతే కచ్చితంగా నష్టాల్నించి గట్టెక్కవచ్చన్నది కంపెనీల ఆలోచనగా ఉంది.

మరోవైపు రోజువారీ ధరల సమీక్షకు ప్రభుత్వం అనుమతిచ్చినా సరే…ఓ స్థాయి దాటిన తరువాత ధరల పెంపుకు అనుమతి ఇవ్వకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం కొనుగోలు అంతరం పూడ్చుకోడానికి రోజుకు 20-40 పైసల వరకే పెంచుకునేందుకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు.  అంతకుమించి ఇవ్వకపోవచ్చు.

ఈ లెక్కన ఎలా చూసుకున్నా సరే…లాక్ డౌన్ అనంతరం పెట్రో ధరలు పెరగడం అది కూడా ేలీటర్ కు 5 రూపాయలు పెరగడం ఖాయంగా తెలుస్తోంది.

FOR VEDIO VERSION :

 

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.