అక్టోబర్ 25 ముహూర్తం…విశాఖకు రాజధాని

విశాఖకు ఏర్పాట్లు…

అక్టోబర్ 25 ముహూర్తం…ఆ దిశగా సంకేతాలు

నవ్యాంధ్రప్రదేశ్ కు ఇప్పుడు కొత్త రాజధానిగా విశాఖ సిద్దమవుతోంది. అక్టోబర్ 25న రాజధాని తరలింపుకు ముహూర్తం సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే ఏర్పాట్లు జరగాల్సి ఉండగా…కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిక అక్టోబర్ లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమౌతోంది. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా  ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ దిశగా  పలు సంకేతాలిచ్చారు. రోజుకో విభాగానికి సంబంధించి సమీక్ష చేస్తూ…అందరి సలహాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పారిశ్రామికవేత్తలు, లబ్దిదారులతో జగన్ మాట్లాడారు. మహా నగరాలైన హైదరాబాద్, బెంగుళూరు లతో పోటీ పడే సత్తా ఒక్క విశాఖ నగరానికే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేయడం వెనుక చాలా విషయాలున్నాయి. ఏపీకు మూడు రాజధానుల అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న జగన్….ఇప్పటికే అదే అంశంపై పట్టుదలగా ఉన్నారు. అందుకే విశాఖ నగర సత్తా గురించి , సామర్ధ్యం గురించి సమీక్షలో జగన్ వ్యాఖ్యలు చేశారు.

కరోనా సంక్షోభం తలెత్తకపోయుంటే ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తయి ఉండేవని పలువులు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ నుంచి నెమ్మది నెమ్మదిగా మినహాయింపు వస్తున్న నేపధ్యంలో అక్టోబర్ 25న రాజధానిని విశాఖకు తరలించేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం.

వైఎస్ జగన్ మాటల్లోనే….

హైదరాబాద్ , బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం.  50 కోట్లు విడుదల చేసి.. బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

ఇక మౌళిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు తనకంటూ ప్రత్యేక బలముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని..చెప్పే మాటల్లో మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధాలు చెప్పనని…రాజధాని పేరిట గ్రాఫిక్స్ లతో కాలం గడిపిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ పేరిట క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలు చేశారు తప్ప.. చేసిందేమీ లేదన్నారు. ఇక మౌలిక సదుపాయల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం… లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్‌ఆర్‌ సీపీ  ఉద్భవించడం రాజకీయంగా ఉపయోపడుతుందన్నారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరంతో పాటు…. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ ఉందన్నారు. దీనికి తోడు నాలుగు పోర్టులు, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టులున్నాయన్నారు.

ఇవాళ జరిగిన సమీక్షలో రాజధానిగా విశాఖ దిశగా పలు సంకేతాలు ఇచ్చారు. విశాఖకు రాజధానిని తరలించే విషయంలో ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అక్టోబర్ 25వ తేదీన ముహూర్తం కూడా కుదిరినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచార వస్తోంది. రానున్న నాలుగేళ్లలో విశాఖ రాజధానిగా ఏపీను పారిశ్రామికంగా ముందంజలో ఉండేట్టు జగన్ ప్రయత్నిస్తున్నారు.

for vedio version :

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.