మైక్రోసాఫ్ట్ లో జియో పెట్టుబడులు….?

రిలయన్స్ సంస్థ నుంచి మరో పెద్ద డీల్….

రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ మధ్య నడుస్తున్న చర్చలు…

దేశీయ వాణిజ్య దిగ్గజమైన రిలయన్స్ మరో భారీ డీల్ కుదుర్చుకోనుంది. ఈ దిశగా ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. రిలయన్స్ సంస్థకు చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్ గా ఉన్న జియో ఖాతాలో ఈ మెగాడీల్ రానుంది. ప్రపంచ ఐటీ దిగ్గజంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థతో జియో ఈ పెద్ద డీల్ ను కుదర్చుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన జియో ఇప్పుడు ఐటీ రంగంలో తన ముద్ర వేస్తోంది.

రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ సారధ్యం వహిస్తున్న జియో…..భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న మైక్రోసాఫ్ సంస్థలో 2న్నర శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఇరువురి మద్య చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రాధమిక దశలో ఉన్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తరువాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.  ఫిబ్రవరి నెలలో ఇండియాను సందర్శించిన సత్య నాదెళ్ల….మైక్రోసాఫ్ట్ సేవల్ని విస్తరించనున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగానే జియోతో ఓ భారీ ఒప్పందం కుదిరేలా కన్పిస్తోంది.  ముఖ్యంగా క్లౌడ్ సేవల్ని సద్వినియోగం చేసుకోడానికి ఇండియా అంతా కీలకమైన ప్రాంతాల్లో డేటా సెంటర్లను ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది. ఎందుకంటే డేటా పరంగా ఇండియాను ఆతి పెద్ద మార్కెట్ గా భావిస్తోంది. ఇందుకనుగుణంగానే ఈ సంస్థ రిలయన్స్ జియోతో ఒప్పందమని వాణిజ్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ తో పాటు….ఇతర సంస్థలైన విస్టా ఈక్విటీ, కేకేఆర్ అండ్ కో, అట్లాంటిక్ , సిల్వర్ లేక్ వంటి సంస్థల్లో 78 వేల 562 కోట్ల పెట్టుబడుల్ని జియో పెట్టింది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.