వైసీపీలో జంప్ అవుతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు….

23 నుంచి 16 కు పడిపోనున్న టీడీపీ బలం…

చంద్రబాబుకు ప్రతిపక్షహోదా గల్లంతు….

40 ఏళ్ల అనుభవం  భవిత ఇప్పుడు ప్రశ్నార్ధకమౌతోంది. పార్టీ పతనం కూడా ఈ 40 ఏళ్ల అనుభవంలోనే జరగనుందా…కనీసం ప్రతిపక్ష హోదా కూడా పోతుందా…పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చంద్రబాబుకు ఊహించని షాక్ ఎదురుకాబోతోంది. తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడనంత భయంకర అనుభవం ఎదురుకానుందా….అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పిందే నిజం కానుందా అంటే కావచ్చనే తెలుస్తో్ంది…..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఇంకో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ సైతం  తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి బాలినేనితో సమావేశం పూర్తయింది. జగన్ తో సమావేశం కీలకంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిక వెనుక బాలినేని చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సైతం వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు అర్ధమౌతోంది.  ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం లు టీడీపీకు దూరంగానూ…వైసీపీకు సన్నిహితంగానూ ఉంటున్నారు. టీడీపీకు చెందిన ఏ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం లేదు. ప్రత్యక్షంగా వైసీపీలో చేరకపోయినా పరోక్షంగా చేరినట్టే. ఎందుకంటే వైసీపీలో నేరుగా చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమనేది జగన్ షరతుగా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే సమయం కోసం వేచి చూస్తున్నారు. వైసీపీ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 

ఇప్పుడు కొత్తగా పర్చూరు, రేపల్లె  ఎమ్మెల్యేలు జగన్ తో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఎందుకంటే జగన్ కంటే ముందుగా వీరి సమావేశం  ప్రకాశం జిల్లా కీలక వైసీపీ నేత మంత్రి బాలనేనితో దాదాపు 4-5 గంటల పాటు సమావేశం జరిగింది.

గత 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 స్థానాల్ని వైసీపీ గెలుచుకోగా….ఒక స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన గెల్చుకుంది. మిగిలిన 23 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకు దక్కాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకూ దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురితోపాటు పశ్చిమ ఎమ్మెల్యై కూడా చేరిపోతే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు పడిపోతుంది. 40 ఏళ్ల అనుభవానికి అతికష్టంగా దక్కిన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా పోతుందో….అసెంబ్లీలో సీటింగ్ అమరికల నుంచి ప్రోటోకాల్ గౌరవాలు, అధికారాలు అన్నిీ పోతాయి. ఎందుకంటే సైనింగ్ , నిర్ణయాత్మక అధికారాలు తప్ప దాదాపుగా అన్నీ ముఖ్యమంత్రికి ఉన్నట్టే ప్రతిపక్షనేతకూ ఉంటాయి. ఇప్పుడు ఈ హోదాకూడా పోతే ఇక చంద్రబాబుకు ఆత్మాహుతి సదృశ్యమే….ఇది ఏపీ రాజకీయాల్లోనే కాదు…దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం అవుతుంది. 

for vedio version:

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.