ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడ…

ఆయన, చంద్రబాబులిద్దరూ రాజకీయ వ్యాపారులే….

కర్చీఫ్ మార్చినట్టే పార్టీలు  మారుస్తుంటారు…

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అందలమెక్కుతారు. పట్టుమని ఓ పార్టీ ఉంటారా అంటే ఉండరు. ప్రజా ప్రతినిధిగా గెలుస్తూనే….పార్టీలు మారుస్తూ అదృష్టాన్ని చేజిక్కింటుకుంటుంటారు.  ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టాన్ని వెన్నంటి పెట్టుకుని తిరుగుతుంటారు.  మరిప్పుడు ఆ నేత, ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు. ఇప్పుడిదే ప్రశ్న సర్వత్రా విన్పిస్తోంది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఉదంతంలో కూడా ఆ నేత ఉనికే కన్పించలేదు.

గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాకుండా…పార్టీ విధాన పర నిర్ణయాల్లో కీలకంగా ఉంటూ చక్రం తిప్పిన ఆ నేత, ఆ మాజీ మంత్రి ఎవరో కాదు విశాఖ ఉత్తర నియోజకవర్గ  టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు. ఈ మధ్యన ఈయన కన్పించడం లేదన్నది వాస్తవమే. అందుకే ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ టీీడీపీ నేత ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేదో రాజకీయ ఆరోపణల్లో భాగంగా కన్పిస్తున్నా సరే…వాస్తవం లేకపోలేదు. గత మూడు నెలల్నించి దేశమంతా కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు ఇటీవల విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఉదంతం కలవరం రేగింది. పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా….చాలామంది నిరాశ్రయులయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించింది ఈ ఘటన. దీనిపై టీడీపీ పెద్దఎత్తున విమర్శలు సైతం చేసింది. అయినా సరే….ఈ మాజీ మంత్రి మాత్రం కన్పించం లేదు. ఎక్కడా ఈ ఘటనపై మాట్లాడిన దాఖలాలు కూడా లేవు.  అందుకే వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నేతగా..మంత్రి అవంతి  చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కోసమేననుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో పూర్తిగా వాస్తవముంది. తమ సొంత జిల్లాలో జరిగిన ఘోరం పై కూడా సీనియర్ రాజకీయనాయకుడిగా కనీసం స్పందించిన పాపాన పోలేదు.  బహుశా అందుకే అనుకుంటా ఇవాళ  మీడియా సమావేశంలో మంత్రి  అవంతి శ్రీనివాస్ కాస్త గట్టిగానే గంటాపై వ్యంగ్యబాణాలు విసిరారు. చంద్రబాబుతో కలిపి ఓ ఆటాడుకున్నారు.  హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీలు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఏమయ్యారని మంత్రి అవంతి ఎద్దేవా చేశారు.  అవంతి చేసిన వ్యాఖ్యలతో గంటా రాజకీయ సన్యాసం తీసుకున్నారంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టైంది. అటు చంద్రబాబు, టీీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు రాజకీయ వ్యాపారులని మంత్రి అవంతి విమర్శించారు. రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం పలకాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు… ఏం ఘన కార్యం చేశావంటూ మంత్రి అవంతి మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గించాలని ప్రయత్నిస్తుంటే…బ్రాండ్ లు అమ్ముడుపోవడం లేదంటూ బాధపడిపోతున్నారని ధ్వజమెత్తారు. కేవలం ఆదాయమే లక్ష్యంగా చంద్రబాబు జనానికి మందుపోయించారని విమర్శించారు.

ఏడాది కాలంలోనే  ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని అవంతి స్పష్టం చేశారు. అంతేకాకుండా….ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా అని ఇంటింటికీ పత్రాన్నిచ్చి టిక్ చేయమని ప్రజల్నే అడిగే ధైర్యం ఒక్క జగన్ కే దక్కిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

for video:

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.