జగన్ చెప్పిన మాటే ఇప్పుడు అందరి నోటా…..

కరోనాతో జీవించేందుకు సిద్ఘంగా ఉండాలన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్…

దిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధం….

కరోనా..ఓ మహమ్మారి. ఇది ముమ్మాటికీ నిజం. అంతకంటే నిజం ఏంటంటే….ఆ మహమ్మారి అంతం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మరి కొంతకాలం ఉంటుంది ఇది. అలాగని ఆ మహమ్మారి ఉన్నంతకాలం లాక్ డౌన్ విధించి కూర్చుంటామా. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్ననే చెప్పారు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని. అప్పుడా మాటల్ని చాలామంది ట్రోల్ చేశారు. విమర్శలు గుప్పించారు. ఇప్పుడదే మాట అందరి నోటా వస్తోంది…

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందీ ఇదే. ఐసీఎంఆర్ చెప్పిందీ అదే. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సహా పలువులు శాస్త్రవేత్తలు అదే  చెప్పారు. ఇప్పుడు ఆ మాటనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ తో జీవించేందుకు సిద్ఘంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా దిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దిల్లీను తిరిగి తెరిచే సమయం ఆసన్నమైందన్నారు.  కంటైన్మెంట్ జోన్లు తప్పించి మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు దిల్లీ సిద్దంగా ఉందన్నారు. కంటెన్మెంట్ జోన్లను మాత్రం పూర్తిగా మూసేస్తామని…ఇతర ప్రాంతాల్ని గ్రీన్ జోన్లుగా ప్రకటించడమే కాకుండా…బేసి రోజుల్లో  దుకాణాల్ని తెరిపిస్తామన్నారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

లాక్ డౌన్ ను పూర్తిగా తొలగించిన తరువాత ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నాామన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మాత్రం ఉండదన్నారు. ప్రైవేట్ వాహనాలు, కార్లు, బైక్ ల కదలిక ఉంటుందన్నారు. బైక్ పై ఒక్కరిని….కార్లలో 2 ప్లస్ వన్ కు అనుమతి ఉంటుందన్నారు.  ఇక మిగిలిన వన్నీ హోంశాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయన్నారు.

మొత్తానికి కరోనాతో సహజీవనం తప్పదనే మాటను….ఒక్కొక్కరిగా అందరూ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఓవర్ నైట్ లో పోయిది కాదని తెలిసినప్పుడు…లాక్ డౌన్ తో ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది మరి. జాగ్రత్తలు పాటిస్తూ…రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే చాలనేదే ఎక్కువమంది అభిప్రాయం.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.