వైఎస్ జగన్ కు సర్వత్రా ప్రశంసలు అందుకే…..

లక్ష బెడ్ ల కు ఏర్పాట్లు..

విదేశాల్లోని తెలుగువారిని రప్పించేందుకు సంసిద్ధత…

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ టాప్…

సంక్షోభం లేదా విపత్తు వచ్చినప్పుడు….ముఖ్యంగా ఆ విపత్తు ప్రపంచవ్యాప్తంగా తలెత్తినదైతే ఎలా ఎదుర్కంటున్నారనే దానిపైనే నాయకుడి లేదా అక్కడున్న ప్రభుత్వ పని తీరు ఆధారపడి ఉంటుంది. విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నది అయినప్పుడు అన్నివిధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. సరైన చర్యలు తీసుకోవాలి.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అదే చేస్తున్నారు…

రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే కూలీలు, కార్మికులు కావచ్చు…విద్యార్ధులు కావచ్చు…అన్నదాలు కావచ్చు…ఇలా ప్రతి రంగం గురించి ఆలోచించాలి. వారి బోగోగుల్ని చూడాలి. అప్పుడే నాయకుడి సామర్ధ్యం తెలుస్తుంది. ఇలా చేయగలిగారు కాబట్టే జగన్ కు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయిప్పుడు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్…

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏ రాష్ట్రమూ చేయనంతగా వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతి ఇంటి జల్లెడ పట్టే కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేస్తూ దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పరీక్షలు చేసే కొద్దీ కేసులు బయటపడి విమర్శలు వస్తాయని తెలిసినా సరే…..ఆ విమర్శలకు భయపడి పరీక్షలు చేయడం ఆపడం లేదు. ఇప్పటికే లక్షకు పైగా పరీక్షలతో దేశంలో టాప్ వన్ లో నిలిచింది ఏపీ. 

ఇంకోవైపు వైద్య సామగ్రిని, సదుపాయాల్ని సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా  లక్ష బెడ్ లు సిద్దం చేయాలంటూ అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇది సామాన్య విషయమేం కాదు.   లక్ష బెడ్ ల ఏర్పాటులో బాగంగా…ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…ఆ సచివాలయాల్లో కనీసం పది నుంచి పదిహేను బెడ్ లు ఉండేట్టు చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా రోగులకు భోజనం, సదుపాయాలు, ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా శనివారం నాడు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జగన్ అధికార్లకు దిశానిర్దేశం చేశారు. కనీసం 5 వందల ఆర్టీసీ బస్సుల్ని నిత్యావసరాల్ని తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని చెప్పారు. ఈ బస్సుల్లోనే వీలైనంతవరకూ ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు, పెరుగుల గుడ్లు పండ్లు వంటి నిత్యావసర పోషక పదార్ధాల్ని ఏర్పాటు చేయాలన్నారు. 

కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన కూలీలు, కార్మికులు, విద్యార్ధుల్ని రప్పించడానికి అనుసరించాల్సిన  విధానంపై కూలంకషంగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని రప్పించడానికి…ఇక్కడున్న ఇతర రాష్ట్రాలే వారిని వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. అందుకే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేకంగా ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

విదేశాల్లోని తెలుగువారిని రప్పించేందుకు సిద్ఘం….

మరీ ముఖ్యంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని  రాష్ట్రానికి రప్పించేందుకు  సహకరించాలని కేంద్రవిదేశాంగ మంత్రిని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా  మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు జగన్.  కువైట్, దుబాయ్ లలో వలస వచ్చినవారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని….దాంతో కువైట్ లో కొన్ని ఇబ్బందులు ఎదురరయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు ఎంబసీ అధికార్లు కృషి చేయాలన్నారు. అక్కడున్న తెలుగువారు స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ వివరాల్ని రాష్ట్రాలకు అందిస్తే….తాము క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అక్కడున్న తెలుగువారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు ఏపీ సంసిద్ఘంగా ఉందని కేంద్ర మంత్రికి వైెస్ జగన్ సూచించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.