ఏపీలో కొత్త జోన్ జాబితా ఇదే…..

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే…..

తీవ్రత తగ్గితే జోన్ల మార్పు…..

దేశంలో కరోనా సంక్రమణ ప్రమాదం తొలగకపోవడంతో కేంద్ర హోంశాఖ మే 17 వతేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుుకున్న విషయం తెలిసిందే. తొలిదశ లాక్ డౌన్ మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 14 వరకూ కొనసాగగా…లాక్ డౌన్ 2లో ఆ గడువును మే 3 వరకూ పొడిగించారు. ఇప్పుడు మళ్లీ ఆ తేదీను మే 17ే వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి పొడిగింపులో చాలావరకూ మినహాయింపులు, ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు భారీగానే కల్పించారు. ఈ సడలింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో  రెడ్ జోన్లు, ఆరెంజ్ జోనా్లు, గ్రీన్ జోన్ల్ వివరాలు ఇలా ఉన్నాయి….

కొత్తగా మరోసారి కేంద్ర ప్రభుత్వం కేసుల తీవ్రత దృష్ఠ్యా జోన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాలను రెడ్‌ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను రెడ్‌ జోన్లుగా నోటిఫై చేయగా…. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాని విజయనగరాన్ని గ్రీన్‌జోన్‌గా డిక్లేర్‌ చేసింది. ఇక  కొత్త జాబితా ప్రకారం  దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌ జోన్లుగా, 284 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లుగా, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లుగా కేంద్రం గుర్తించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.  తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 ఆరెంజ్‌ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.  కరోనా సంక్రమణ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని హాట్ స్పాట్ లుగానూ…కాస్త తక్కువున్న వాటిని ఆరెంజ్ పరిదిలోనూ….ఏ కేసులు లేనివాటిని గ్రీన్ జోన్లుగా విభజించారు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా జోన్ల వివరాలు…..

రెడ్ జోన్ : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు,  చిత్తూరు జిల్లాలు

ఆరెంజ్ జోన్ :  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం జల్లాలు

గ్రీన్ జోన్ : విజయనగరం

ఈ వివరాల ప్రకారం ఇకపై  అంటే  లాక్ డౌన్ 3లో ఆయాజోన్లలో సడలింపులు  ఉంటాయి. జోన్లతో సంబంధం లేకుండా విమానాలు, రైళ్లలో ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ,హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి  ఉంటాయి. అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు చేశారు.

ఇక గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తారు. వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కేసుల తీవ్రత తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మారుస్తారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతితో పాటు…గ్రీన్  జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7వరకు వ్యాపారాలకు అనుమతి లభిస్తుంది. ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతితో పాటు కార్లలో కేవలం ఇద్దరికి మాత్రం పర్మిషన్ ఉంటుంది. అటు టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి ఉంటుంది. దాంతోపాటు ఈ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఎటువంచి ఆంక్షలు ఇకపై ఉండవు. ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి ఉంటుంది.  ముందుగా అనుకున్నట్టుగానే….వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి ఉంటుంది. రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు.

మరోవైపు  ప్రైవేట్ సంస్థలు మాత్రం కేవలం 33 శాతం సిబ్బందితోనే పనిచేసే అనుమతి ఉంటుంది.  రాష్ట్రాల పరిధిలో మాత్రం బస్సులు తిరుగుతాయి. అది కూడా సగం సీట్లకే పర్మిషన్ ఉంటుంది.  గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్ లైన్ షాపింగ్ ఉంటుంది.  బహిరంగ ప్రదేశాల్లో  ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.  పెళ్లిళ్లలకు అనుమతి ఉన్నాసరే…కేవలం 50 మంది వరకే హాజరవ్వాల్సి ఉంటుంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.