మే 17 వరకూ లాక్ డౌన్….

దేశంలో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు….

మే 4 నుంచి మే 17 వరకు సడలింపులతో కొనసాగనున్న లాక్ డౌన్…

కరోనా సంక్రమణ ఆగకపోవడంతో..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4  వ తేదీ నుంచి మే 17 వరకూ ఇది అమలవుతుందని…కేంద్రహోంశాఖ తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు ఈసారి. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షించనున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు ఇంకా దేశవ్యాప్తంగా తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగియగా….‌ రెండో దశ ఏప్రిల్‌ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే హోంశాఖ, ఇతర ముఖ్యధికార్లతో సమీక్షించిన ప్రధాని మోదీ…లాక్ డౌన్ మూడో దశను ప్రకటించారు. మే 4 నుంచి 17 వరకూ కొనసాగనున్నట్టు…కొన్ని సడలింపులు మాత్రం ఉంటాయని స్పష్టం చేసింది హోంశాఖ.  దీంతో  ఇప్పటివరకూ మొత్తం 56 రోజులు భారత్  లాక్‌డౌన్లో ఉన్నట్లుంటుంది. మూడో దశలో మాత్రం కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు లభించాయి.)

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు…సడలింపులు…

 • విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం
 • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు,,స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు  బంద్…
 • అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు

సడలింపులు…..

 • గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
 • రాత్రి 7గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ
 • వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన
 • కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
 • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
 • గ్రీన్‌ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపారాలకు అనుమతి
 • ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి.. కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి.. టూ వీలర్ పై ఒక్కరికే అనుమతి
 • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
 • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి
 • వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి..
 • 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
 • రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
 • బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
 • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి
 • ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
 • అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
 • బహిరంగ ప్రదేశాల్లో  మాస్క్‌ తప్పనిసరి
 • పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
 • అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి

కరోనా వైరస్ సంక్రమణ  నియంత్రణలో భాగంగా…. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించిన విషయం తెలిసిందే.  అవి రెడ్ , ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ఉన్నాయి. జోన్లవారీగా నిబంధనల్ని విధించారు. ఇప్పుడు ఈ జోన్లలో కొన్ని రకాల సడలింపుల్ని మరి కొన్ని ఆంక్షల్ని విధించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.