కరోనా నిర్ధారణ పరీక్షల్లో అగ్రస్థానం ఏపీదే….

కరోనా పరీక్షల్లో ముందంజలో ఏపీ…..

రెండవస్థానంలో తమిళనాడు….

కరోనా..ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి.  రోగ నిర్ధారణ జరిగితే ఓ రకమైన ఆందోళన…లేకుంటే మరో ఇబ్బంది. కొందరిలో లక్షణాలు అంత త్వరగా బయటపడవు. పరీక్షలు చేస్తే గానీ ఎవరికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలియని పరిస్థితి. మరి అటువంటప్పుడు ఏదో మొక్కుబడిగా లాక్ డౌన్ లు పాటించేస్తే సరిపోతుందా…లేదా పరీక్షలు చేస్తే కేసులు పెరిగి…ప్రభుత్వాలపై విమర్శలు వస్తాయని భయపడి ఊరుకోవడం  సమంజసమేనా….

ముమ్మాటికీ కానేకాదు. ఓ వైపు పరీక్షలు చేయడం…పాజిటివ్ గా తేలినవారిని ఎక్కడికక్కడ ఐసోలేషన్ కు పంపించడం చేస్తూనే లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనల్ని పాటించడం ఇదీ చేయాల్సిన పని. అదే సమయంలో తీవ్రత తక్కువున్న ప్రాంతాల్లో నిబంధనల్ని సడలించి ఆర్ధిక వ్యవస్థను పట్టాలపైకి తీసుకురావడం. కరోనా ను నియంత్రించాలంటే ఇదే మార్గం. ఎందుకంటే కరోనా ఇప్పటికిప్పుడు పోయేది కాదు.  సమయం పడుతుంది.

అందుకే ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ కరోనా నిర్ధారణ పరీక్షలకు పెద్దపీట వేశారు. రోజురోజుకూ పరీక్షల సామర్ధ్యం పెరగాలని అధికార్లను ఆదేశించడమే కాకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఇదే ెచెబుతోంది. సాధ్యమైనన్ని పరీక్షలు ఎక్కువ చేయాలని. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా నిర్ధారణ పరీక్షల్లో అగ్రగామిగా నిలిచింది. ఇప్పుుడే కాదు గత నెలరోజుల్నించి క్రమంగా పరీక్షల్లో నెంబర్ వన్ స్థానంలోనే ఉంది.

కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకుపోతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిర్ధారణ టెస్ట్‌ల గణాంకాలు పరిశీలిస్తే…. ఏపీ అత్యధిక ‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది.  ప్రతి పది లక్షల మందిలో 1771 చొప్పున వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు అదే పదిలక్షలకు  1400 పరీక్షలతో తమిళనాడు రెండవ స్థానంలో ఉండగా..  ఒక్క మిలియన్ కు1200 పరీక్షలతో రాజస్థాన్‌ 3వస్థానంలో ఉంది. ఏపీలో గత నెలరోజులుగా క్రమంగా పరీక్షల సామర్ధ్యం పెరుగుతోంది. గతంలో ప్రతి పదిలక్షలకు వేయి మందికి పరీక్షలు చేస్తుంటే ఇప్పుడా సంఖ్య 18 వందలకు చేరుతోంది.  ఇప్పటివరకు  రాష్ట్రంలో 94వేల 558 పరీక్షలు నిర్వహించగా…..1403 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు గత ఐదురోజుల్నించి ఏపీలో ఒక్క కరోనా మరణం కూడా చోటుచేసుకోలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పాజిటివ్‌ రేటు 1.48 శాతంగా ఉండగా.. మరణాల రేటు 2.21 శాతంగా ఉంది. ఇప్పటివరకూ కరోనా  వైరస్‌ నుంచి ఏపీలో 321 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్పటికే రాష్ట్రంలో  9 వైరాలజీ ల్యాబ్ లు ఉండగా..మరో నాలుగు ఏర్పాటవుతున్నాయి. ఎప్పటికప్పుడు మెడికల్ ఎక్విప్ మెంట్ లు సిద్ధం చేసుకోవడంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.