ఇండియన్ కంపెనీ నుంచి కరోనా వ్యాక్సీన్ త్వరలో….

 

కరోోనా వైరస్ వ్యాక్సీన్ ధర వేయి రూపాయలు..….

ఇండియాలో ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్ సన్నాహాలు….

కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తున్న  వ్యాక్సీన్ 
ఇప్పుడు బ్రిటన్ లో క్లినికల్  ట్రయల్స్ లో ఉంది…జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయినందున సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సీన్ ను ఆక్స్ ఫర్డ్ సహకారంతో ఇండియాలో తయారు చేసేందుకు నిర్ణయించుకుంది.

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ లో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సీన్  ను ఏడాదికి 60 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసేందుకు పూణేకు చెందిన ప్రఖ్యాత వ్యాక్సీన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సీన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ …ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి ఈ వ్యాక్సీన్ ను తయారీలో నిమగ్నమైంది. ఇప్పటికే గత వారంలో మనుషులపై ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. నోవల్ కరోనా వైరస్ కు యాంటీడోట్ తయారీ రేసులో ఈ కంపెనీ ముందంజలో ఉంది ప్రస్తుతానికి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా వ్యాధి బారిన పడగా….రెండు లక్షలకు పైగా మృత్యువాత పడ్డారు.  క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సీన్ ను ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ  “ChAdOx1 nCoV-19 గా నామకరణం చేసింది. జంతువుల్లో ప్రయోగాలు సక్సెస్  కావడంతో…మనుష్యులపై ట్రయల్స్ పురోగతిలో ఉండటంతో….సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సీన్ ను ఇండియాలో ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సీరమ్ సీఈఓ అడార్ పూణావాలా స్పష్టం చేశారు.

పూణే కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫి ఇండియాను సైరస్ పూణావాలా 1966లో స్థాపించారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సీన్ ఉత్పత్తి చేసే కంపెనీగా పేరుగాంచింది. 1.5 బిలియన్ డోసుల వ్యాక్సీన్లను ఉత్తత్తి చేస్తూ…ప్రపంచవ్యాప్తంగా 65 శాతం పిల్లలకు వ్యాక్సినేషన్ ఈ కంపెనీ మందులతోనే అవుతోంది.  యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో, యూఎస్ కు చెందిన బయోటెక్ కంపెనీ  కోబాడెక్స్ కంపెనీతో , సొంత ఉత్పత్తి అయిన రీ కాంబినెంట్ బీసీజీ వ్యాక్సీన్ తో ఒప్పందాలతో ఈ కంపెనీ వార్తల్లో నిలిచింది.

ఆసక్తి కలిగించే ముఖ్యమైన విషయమేంటంటే..ఇప్పటికే సీరమ్ కంపెనీ ఈ వ్యాక్సీన్ ఉత్పత్తిని ప్రారంభించేసింది. ఒకవేళ ట్రయల్స్ చివరి దశలో విఫలమైనా..అప్రూవల్ లభించకపోయినా సరే ..కంపెనీ ఉత్పత్తి అంతా వృధా అవుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కావడంతో సొంత రిస్క్ తో కంపెనీ ఈ ప్రక్రియకు పూనుకుంది. 1.5 బిలియన్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉండటం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ రంగంలో పేరున్న సంస్థ కావడంతో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఈ కంపెనీను భాగస్వామిగా ఎంచుకుంది….

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.