దిల్లీలో సీఏఏ అల్లర్లు…నలుగురి మృతి

సీఏఏకు పై అల్లర్లు మరోసారి హింసాత్మకం…

సీఏఏ మద్దతుదార్లు, నిరసనకార్లకు మధ్య ఘర్షణ…

హెడ్‌ కానిస్టేబుల్‌ సహా నలుగురు మృతి 

ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్  భారత పర్యటనలో బిజిగా ఉన్న తరుణంలో…ఇటు దేశ రాజధాని నగరం దిల్లీలో సీఏఏ పై అల్లర్లు హింసాత్మక రూపం దాల్చాయి.  యాధృచ్ఛికమో కాదో తెలియదు కానీ అటు అమెరికాలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై  జరుగుతున్న అల్లర్లు తీవ్ర హింసాత్మక రూపం దాల్చాయి. సోమవారం నాడు సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మరణించినవారిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌ లాల్, మరో ముగ్గురు పౌరులు ఉన్నారు. గాయపడినవారిలో డీసీపీ అమిత్‌ శర్మ సహా, ఏసీపీ, ఇద్దరు సీఆర్‌పీఎప్‌ జవాన్లు సహా 11 మంది పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. అలర్లను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం.

దిల్లీలో సీఏఏ నిరసనకారుడిని చావబాదుతున్న సీఏఏ మద్దతుదారులు

ఢిల్లీ ఈశాన్యంలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలో సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకులు ఇరువురూ రోడ్కెక్కి.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బాష్పవాయు గోళాలను సైతం ప్రయోగించారు. ఆందోళనకారులు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. కొన్ని గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌–బాబర్‌పూర్‌ మార్గంలో మెట్రో సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపేశారు. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా పిలుపు మేరకు సోమవారం కొందరు వ్యక్తులు మౌజ్‌పూర్‌లో గుమిగూడిన సందర్బంగా ఈ ఘర్షణలు చెలరేగడం విశేషం. సీఏఏను వ్యతిరేకించేవారిని మూడు రోజుల్లో ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని ఈ సందర్భంగా కపిల్‌ మిశ్రా పోలీసులను డిమాండ్‌ చేశారు. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ ద్వారా లెప్టినెంట్‌ గవర్నర్, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కోరారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.