ట్రంప్..మోదీల వెంట ఆ మహిళ ఎవరు….

ట్రంప్..మోదీల వెంట ఆ మహిళ ఎవరు….

రెడ్ కార్పెట్ లో ఆమెకు స్థానమెందుకు…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన వెన్నంట కనిపించిన ఆ మహిళ ఎవరనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ వినిపిస్తోంది.  అందులోనూ ఓ భారతీయ మహిళ ట్రంప్ తో కలిసిరావడం…రెడ్ కార్పెట్ లో వెంట నడవడంతో ఆమె ఇప్పుుడు హాటా్ టాపిక్ గా మారిపోయారు. ఈ మహిళ ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారంతా…..

ఈ చర్చనీయాంశమైన ఆ మహిళ పేరు గురు దీప్  కౌర్ చావ్లా.  గురు దీప్ కౌర్ చావ్లా భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకు..అమెరికా అధ్యక్షుడు గురుదీప్ చావ్లాకు మధ్య  అనువాదకురాలిగా ఉన్నారు. గురుదీప్ ఇటీవల అమెరికా ట్రాన్స్ లేటర్ అసోసియేషన్ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ పర్యటనల సందర్బఁగా మోదీ ఎప్పుడు హిందీలో ప్రసంగం ఇస్తున్నా….గురుదీప్ నే దాన్ని ఆంగ్లంలో అనువాదం చేస్తోంది.  గురుదీప్ కు చాలా భాషల్లో పరిజ్ఞానముంది.

భారత సంతతికి చెందిన గురుదీప్ చావ్లా అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఒక్క మోడీ వద్దే కాదు- ఏడుమంది ప్రధానమంత్రుల వద్ద ఆమె అనువాదకురాలిగా పని చేశారు. వీపీ సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌ల వద్ద పని చేశారు.  గతంలో భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు అనువాదకురాలిగా పనిచేశారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశం, మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఈవెంట్, విదేశాంగ మంత్రుల మండలి భేటీ.. వంటి కీలక సందర్భాల్లో ఈమె పాత్ర కన్పించింది.

1990లో ఎంపీగా ఆమె తన పొలిటికల్ కేరీర్‌ను ఆరంభించిన గురుదీప్ కౌర్  ఆ తరువాత కొద్ది రోజులకే అమెరికాకు వెళ్లిపోయింది.  దాదాపు అన్ని ప్రధాన భాషల మీద ఆమెకున్న పట్టే ఈ స్థాయికి చేర్చింది. ఇప్పుడు మహామహులతో కలిసి రెడ్ కార్పెట్ లో నడిచి వైరల్ అవుతోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.