1998 ఎ లవ్ స్టోరీ ఆఫ్ ట్రంప్….

ఇది 1947 ఏ లవ్ స్టోరీ కాదు…

ట్రంప్ లవ్ స్టోరీ ఎట్ 1998..

 

ప్రపంచపు అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడిగా…విలక్షణ శైలితో తరచూ విమర్శలకు గురయ్యే వ్యక్తిగా ప్రాచుర్యం పొందిన డోనాల్డ్ ట్రంప్ ది లవ్  స్టోరీ అంటే నమ్మగలరా…తప్పదు నమ్మాల్సిందే. అదే లవ్ స్టోరీ ఎట్ 1998.

ఈ లవ్ స్టోరీలో అందరి ప్రేమల్లానే తొలుత నిరాకరణ ఉంది. ప్రాధేయపడటముంది. ఫాలోయింగ్ ఉంది. చివరికి ఒప్పించడముంది. ప్రేమను దక్కించుకోవడముంది. బహుశా అందుకే అనుకుంటా తాజ్ మహల్ సందర్శన వీరికి ఓ చిరకాల కోరికగా ఉంది. ఇన్నేళ్లకు సాకారమైంది. ఆ లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా….

మెలానియా  వాస్తవానికి ఓ గ్లామర్‌ మోడల్‌. డోనాల్ట్ ట్రంప్‌ తొలిసారి ఈమెను 1998లో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు కేవలం 28 ఏళ్లు. కానీ ట్రంప్ వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. ట్రంప్ అప్పటికే ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్‌. టెలివిజన్‌ పర్సనాలిటీ. తన రెండో భార్యతో విడివడి ఉంటున్నాడు. మెలానియాను చూడగానే… ‘వావ్‌.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మనదేశ అమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్‌ అని చెప్పారు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే కుటుంబంతో సహా న్యూయార్క్‌ వచ్చినట్లు చెప్పింది మెలానియా. 

మాట్లాడుతుంది కదా అనుకుని…ఫోన్‌ నెంబర్‌ అడిగాడు. అయితే  మెలానియా ఇవ్వలేదు. ఆ సమయంలో ట్రంప్ పక్కన సెలీనా మిడెల్‌ఫార్ట్‌ అనే మరో అమ్మాయి ఉంది. సాధారణంగా అమ్మాయిల్లో సహజంగా కన్పించే భావనే వ్యక్తం చేసింది. ఓ అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్‌ నెంబర్‌ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్‌ ఇవ్వలేదు.

అయితే మన ట్రంప్ మాత్రం వదల్లేదు అంతటితో. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమను పొందేందుకు నిరంతరం ప్రయత్నించాడు. మెలానియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వెళ్లిపోయాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. మెలానియాతో ఔనని అన్పించాడు.  అయితే కొన్నాళ్లకే మళ్లీ నో అంది మెలానియా. ఇలా చాలాకాలం…ఎస్ …నో లతో ఆ బంధం నడిచింది. తొలిసారిగా…ఈ ఇద్దరి మధ్య బంధం హోవార్డ్ స్టెర్న్ టీవీషోలో ప్రపంచానికి తెలిసింది. ఇద్దరి మధ్య బంధం గురించి ట్రంప్ నే నేరుగా ప్రకటించారు. 2005లో టీవీ ఛానెల్ లో మెలానియాతో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు ట్రంప్.  వాస్తవానికి అంతకు ఓ ఏడాది ముందే ఈ ఇద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా అయింది. అప్పట్నించి ఇద్దరి బంధం హాయిగా కొనసాగుతూ..ఇప్పుడు తాజ్ ప్రేమ గోడల్ని చుట్టుముట్టింది.

ఇక మెలానియా గురించి తెలుసుకుంటే…ఆమెకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. తండ్రి స్లోవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు  కూడా. తల్లికి సొంతంగా క్లాత్ కంపెనీ ఉంది. మెలానియాకు ఓ చెల్లి..ఓ అన్న. అన్నంటే తన తండ్రి మొదటి భార్య కుమారుడు. కానీ మెలానియా అతన్నెప్పుడూ చూడనే లేదు. మెలానియా తన చదువును మధ్యలోనే ఆపి…మోడల్ రంగంలో వచ్చేసింది.  మెలానియా…స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్‌.. భాషలు మాట్లాడగలదు. ఇదీ సంక్షిప్తంగా మెలానియా కధ…
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.