ఇండియాలో ట్రంప్ కు ఎదురైంది ఏంటి…

ట్రంప్ కార్యక్రమంలో….

సబర్మతీ ఆశ్రమంలో…నమస్తే …

అమెరికా అధ్భక్షుడు డోనాల్ట్ ట్రంప్.. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ట్రంప్  దంపతులకు ఎయిర్ పోర్ట్ లో భారీ స్వాగతం లభించింది.  దేశ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతమిచ్చారు.  గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ, కేంద్రమంత్రులు , ఉన్నతాధికార్లు వెంట ఉన్నారు.  ట్రంప్ తో పాటు ఆయన కూతురు ఇవాంకా,  అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్‌ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. అనంతరం విజిటర్స్ బుక్ లో తన పేరు రాసి సంతకం చేశారు ట్రంప్.  ఇదే ఆశ్రమంలో ఏర్పాటు చేసిన త్రీ మంకీస్ విశేషాల్ని  ప్రధాని మోదీ ట్రంప్‌కు వివరించారు.

అంతకుముందు ఎయిర్ పోర్ట్  సర్కిల్ లో  ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగిన రోడ్‌షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు.

సబర్మతీ ఆశ్రమం సందర్శన అనంతరం తిరిగి బారీ కాన్వాయ్ తో….ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీలు  అహ్మదాబాద్ లోని మోటేరో స్టేడియంకు చేరుకున్నారు.  దారి పొడుగునా రోడ్డుకు ఇరువైపులా చేరుకున్న జనం ట్రంప్ కు..మోదీకు అభివాదం పలుకుతూ స్వాగతం పలికారు.  స్డేడియంలోపలకు చేరుతూనే…ట్రంప్ మోదీలు జనానికి అభివాదం తెలుపుతూ పలకరించారు.

 

 

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.