అమరావతిలో ఈడీ దర్యాప్తు….?

ఇన్ సైడర్,  మనీ ల్యాండరింగ్‌పై ఆధారాలు 

ఈ నెలలో ఈడీ దర్యాప్తు ప్రారంభం…  

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు ప్రారంభం కానుంది. బహుశా ఈ నెలాఖరులోగా ఆ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ప్రారంభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వ హాయంలోనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాలాసార్లు అమరావతి విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని…ముఖ్యంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ,,పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు చేశారు. దీనిపై దర్యాప్తు చేయించాలని కూడా అన్నారు. ఇప్పుడవన్నీ వెలుగు చూస్తున్నాయి. రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌పై క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా…. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పంపిన ఆధారాలను పరిశీలించిన ఈడీ కేసు కూడా నమోదు చేసింది. అమరావతిలో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌, ఫారన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసిన ఈడీ తగిన  ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

హైదరాబాద్ లోని ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గ్రౌండ్ లెవల్ దర్యాప్తుకు సిద్ధమైంది. అమరావతిలో జరిగిన లావాదేవీల్ని ఆరా తీస్తున్నారు. సీఐడీ తన దర్యాప్తులో ప్రాధమికంగా సేకరించిన వివరాల్ని ఈడీకు అప్పగించింది. వీటిని ఈడీ పరిశీలిస్తోంది.

ఎన్ని తప్పుులు చేసినా ఎక్కడో చోట దొరికిపోతారనేది అందరికీ తెలిసిందే.  ఇక్కడా అదే జరిగింది. పచ్చనేతలు బినామీ పేర్లతో చాలావరకూ భూములు కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనికి కారణం…అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో దాదాపు  797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు ఏకంగా 276 కోట్ల రూపాయలు పెట్టి ఆ భూముల్ని ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారులు భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగే పనిలో పడింది. రికార్డుల పరిశీలన అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ.. అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెలలోగా సీఐడీతో ఈడీ జాయింట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా కేవలం బినామీ పేరిట కొనుగోలు వ్యవహారాలే. ఇవి కాకుండా తమ వర్గం వారితో కొనుగోలు చేయించిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అక్కడే రాజధాని వస్తుందన్న విషయం తెలుసుకుని ముందే భూముల్ని కొనుగోలు చేయించడం…దీనికి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. బహుశా అందుకే అనుకుంటా….రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఏ వర్గానికీ లేని కష్టమంతా పచ్చవర్గానికే వస్తోందిప్పుడు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.