అధికారం కోసం ఎత్తుకుపై ఎత్తులు

న్యూ ఢిల్లీ , ఫిబ్రవరి 19 :
రాజ్యాధికారం కావాలా ? అయితే జనాల్లోకి వెళ్ళండి… జనం మధ్యలో ఉండండి.  ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. జనం గాధలు వినండి. ప్రజలను పలకరించండి. ప్రజలు చెప్పింది వినండి. ప్రజలతో మమేకం కండి . అప్పుడే మీ చేతికి రాజ్యాధికారాం లభించే అవకాశం ఉంటుంది. ఇది చాలా సార్లు రుజువు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అధికారం కోసం యాత్రల రాజకీయం ఆంధ్రాలో కొత్త కాదు. సాధారనంగా ఎన్నికల సమయంలోనే పాదయాత్రలు, బస్సు యాత్రలు …ఇలా రాజకీయ యాత్రలు జరిగేవి కానీ రాజశేఖర్ రెడ్డి చూపిన సుదీర్ఘ పాదయాత్ర ఇప్పుడు ఆంధ్ర నేతలందరికీ దారి ఆదర్శ యాత్రగా మారింది.    జనంతో కలిసి యాత్ర చేస్తే రాజ్యాధికారం తధ్యమని నిరూపించారు రాజశేఖర్ రెడ్డి. 2004 లో రాజశేఖర్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ తెచ్చి పెట్టింది. రాజశేఖర్ రెడ్డి ని తొలిసారిగా ముఖ్యమంత్రిని కూడా చేసింది  పాదయత్రనే.  ఆ తరువాత  రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటనే అనుసరించారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ విభజన తరువాత ఆంధ్ర లో తొలి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 2014 లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడానికి , వై ఎస్ ఆర్ పార్టీ అధికారం హస్తగతం చేసుకోడానికి జగన్ పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. తండ్రి ఎలా తిరిగాడో కొడుకు జగన్ కూడా అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. అందరిని కలిశారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు విన్నారు. ఏ జిల్లాలో  ఏయే  సమస్యలు శాశ్వతంగా ఉన్నాయి? తాతాళిక సమస్యలు ఏమిటి ? వంటి వాటిపై పూర్తిగా అవగాహనా పెంపొందించుకున్నారు.  సుమారు మూడేళ్ళ పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జనం మధ్యలోనే గడిపారు. జనం సమస్యల పరిస్కారం కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. అధికారంలోకి వస్తే ఏం  చెయ్యాలో… నినాయించుకున్నారు. పాదయాత్రతోనే ”నవరత్నాలు” హామీ కూడా ఇచ్చారు. కళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగినట్లు పాదయాత్ర చేస్తున్న వై ఎస్ గారి అబ్బాయికి  ”ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం” అనే సానుభూతి  సైతం జనాల్లో తెచ్చుకోగలిగారు జగన్.


ఇంకేముందీ…. 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో అసాధారణ మెజారిటీ సాధించారు వై ఎస్ జగన్. ఆంధ్ర రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా వై ఎస్ ఆర్ పార్టీ అవతరించింది. వై సి పీకి వచ్చిన సీట్ల సంఖ్య, ఓట్ల శాతం చూసి రాజకీయ ఉద్దండులకు సైతం దిమ్మతిరిగి పోయింది. జగన్ రాజకీయ ఎత్తుగడ ముందు చంద్రబాబు అనుభవం చతికిల పడింది. ఫలితం తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారాన్ని కోల్పోయింది.  2004 లో వై ఎస్ ఆర్ పాదయాత్ర  చంద్రబాబు అధికారాన్ని కొల్లగొడితే…. 2019 లో ఆయన కుమారుడు జగన్ పాదయాత్ర చంద్రబాబును చావు దెబ్బ కొట్టింది.


ఆంధ్ర రాష్ట్రంలో జగన్ పాలన ప్రారంభమై ఆరు నెలలు దాటింది. చంద్రబాబు జనాల ముందుకు వెళ్ళడానికి ఓ ఆయుధం దొరికింది. ”మూడు రాజధానులు వద్దు …అమరావతి ముద్దు” అంటూ గళం విప్పాడు చంద్రబాబు. ఒకపక్క అమరావతి రాజధానిలో రైతుల పోరాటం మొదలైంది. యాభై రోజులు కూడా దాటింది. ఈ పోరాటాన్ని వై సి పీ తిప్పి కొట్టే పనిలో పడింది. మూడు రాజధానులు మద్దత్తుగా వై సి పీ కూడా ర్యాలీలు నిర్వహిస్తోంది. చివరికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం అమరావతి పోరాటంలో తనవంతు బాధ్యతగా పాలు పంచుకుంటున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు బస్సు యాత్ర మొదలు పెట్టారు.  జగన్ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు రోడ్డెక్కారు. జగన్ ను గద్దె దించడమే పనిగా తెలుగు తమ్ముళ్లు   మాటల యుద్ధం కూడా చేస్తున్నారు.  ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఈ నాలుగేళ్ళ వరకు చంద్రబాబు ఇదే అంశాన్ని పట్టుకుని పోరాటం చేస్తారా? లేక కొత్త రాజకీయ ఎత్తుగడను ప్రయోగిస్తారా? పాదయాత్ర  చేసి  వై ఎస్ ఆర్, జగన్ అధికారంలోకి వచ్చినట్టు నారావారి నేత బస్సు యాత్రతో అధికారంలోకి వస్తారా ? యాత్రల రాజకీయాలు భవిష్యత్తులో  ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి? వేచి చూద్దాం.

 

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.