NO CAA :KCR

హైదరాబాద్, జనవరి 25 : భారతదేశం మరికొద్ది గంటల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న తరుణంలో కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA ) పై తెలంగాణ వైఖరి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు. సి ఏ ఏ విషయంలో కేరళ బాటలో కేసీఆర్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభఉత్వం కూడా అదే పని చేయబోతోంది. సి ఏ ఏ కు వ్యతిరేకంగా తెలంగాణ సెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖమంత్రి కె సి ఆర్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించింది. రాజ్యాంగం లో మైనారిటీలకు విద్య ఉద్యోగ రంగాల్లో కూడా ప్రాధాన్యత ఉంది. తాజాగా బీజేపీ సర్కారు చేసిన పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లు లో మైనారిటీలను మినహాయించారు. అందుకే ఇది భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగానే చెప్పేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో గొడవలు జరిగాయి. ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నాయి కూడా. పశ్శిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ బిల్లును అమలు చెయ్యబోమని, ముస్లింలకు ఇది వ్యతిరేకంగా ఉందని నెత్తి నోరు బాదుకుంటోంది. మరో పక్క కేరళ ప్రభుత్వం ఏకంగా పొరసత్వ సవరణ చట్టాన్నీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎం ఐ ఎం అధ్యక్షడు హైదరాబాద్ ఎంపీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగానే CAA పై స్పందించారు. అయితే ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తే సి ఏ ఏ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఇక్కడ స్పష్టమవుతోంది . ఇటీవల ఒవైసీ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి CAA కు మద్దత్తు చెప్పవద్దని కోరారు. సి ఏ ఏ కు వ్యతిరేక వైఖరిని స్పష్టం చేశారు. సి ఏ ఏ తప్పుడు బిల్లు అనేది తప్పుడు నిర్ణయం అని వ్యాఖ్యానించారు. సి ఏ ఏ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో కూడా సమావేశమవుతానన్నారు. ఇప్పటీ పలువురు ఎంపీలతో మాట్లాడుతన్నానని పేర్కొన్నారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.