రాచకొండ పోలీసుల తనిఖీలు…దొరికిన గంజాయి ముఠా

హైదరాబాద్ , జనవరి 16 : తెలంగాణా లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఓ టి పోలిసులు చేస్తున్న విస్తృత తనిఖీల్లో ఓ గంజాయి ముఠా పట్టు బడింది. ఈ ముఠా నుంచి యాభై ఒక్క కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. యాభై ఒక్క కేజీల గంజాయితో పాటు ఒక ఇన్నోవా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శివారు ప్రాంతంలో అంతరాష్ట్ర గంజాయి ముఠా తిరుగుతుండగా పట్టుకున్నమై అన్నారు. వంశీ నాయక్, రాజ్ నాయక్ , రతన్ లాల్ ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారుమరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి షిరిడి కి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. విశాఖపట్నం లోని ధారకొండ లో రెండు వేళా రూపాయలకు కిలో గంజాయి కొనుగోలు చేశారని, ఏడు వేల రూపాయలకు కిలో అమ్ముతున్నారని చెప్పారు. వివిధ పోలీస్ స్టేషన్లలో .క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.