క్రికెట్ కు ధోని ఇక దూరం ?

ముంబై , జనవరి 16:

రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి…క్రికెట్ ప్రపంచంలో దాదాపు రెండు దశాబ్దాల వరకూ రాజ్యమేలిన మహేంద్ర సింహ్ ధోనీ ను భారత టీమ్ నుంచి దూరం చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వరల్డ్ కప్ తరువాత నుంచే ఈ విషయమై చర్చ జరుగుతోంది. కానీ బీసీసీఐ తాజా కాంట్రాక్ట్ జాబితాలో ధోనీ లేకపోడవం దీనిని స్పష్టం చేస్తోంది.

బీసీసీఐ 2019-20 కాంట్రాక్టర్ జాబితాలో ధోనీ లేరు. ఈ జాబితో 2019 అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ కోసం సిద్ధం చేసింది. గురువారం నాడు ఈ జాబితాలో మొత్తం 27 మంది ఆటగాళ్ల పేర్లున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో మూడు కేటగరీలున్నాయి. ఏ, బీ, సీలు. ధోనీ పేరు ఈ జాబితాలో ఎప్పుడూ ఏ కేటగరీలో ఉండేది. కానీ తాజా జాబితాలో ధోనీ పేరు ఏ, బీ , సీలోని ఏ కేటగరీలో కూడా లేదు.

ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి ముందే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇదే ఏడాది అక్టోబర్-నవంబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ధోనీ చివరిసారి క్రికెట్ మైదానంలో తన ప్రతిభ కనబరుస్తారని తెలిసింది. కానీ బీసీసీఐ తాజా జాబితా చూసిన అనంతరం ఆ అవకాశాలు పూర్తిగా తొలగిపోయాయి.

WELLINGTON, NEW ZEALAND – FEBRUARY 06: MS Dhoni of India looks on during game one of the International T20 Series between the New Zealand Black Caps and India at Westpac Stadium on February 06, 2019 in Wellington, New Zealand. (Photo by Hagen Hopkins/Getty Images)

కొన్ని రోజుల క్రితమే టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై సంకేతాలిచ్చారు. ధోనీ వన్ డే క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చని. కానీ ధోనీ ఇప్పుడు అన్ని క్రికెట్ ఫార్మాట్ ల నుంచి సన్యాసం తీసుకోవవల్సి వస్తుందా అని అన్పిస్తుంది. గత యేడాది ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కంప్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ కు వ్యతిరేకంగా రెండో రన్ ను పూర్తిచేయలేకపోయిన ధోనీ కెరీర్ అప్పుడే ఆగిపోయిందా అని కూడా అన్పిస్తోంది. ఎందుకంటే ఆ తరువాత దోనీ ఇప్పుటివరకూ ఏ అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడలేదు

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.