అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్:దేవినేని ఉమ

ప్రజలు పండుగరోజు సైతం పస్తులతో నిరసన తెలుపుతుంటే అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్ పండుగ సంబరాలు చేస్తున్నాడు..మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమ

అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ నందిగామలో ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా “పండుగరోజు పస్తు” పేరుతో బుధవారం సంక్రాంతిపండుగ నాడు నిరసన దీక్షకు కూర్చున్న వారికి సంఘీభావం తెలిపేందుకు చెరుకుంపాలెం, బెల్లంకొండవారిపాలెం, పెద్దవరం, తదితర గ్రామాల నుండి పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి వచ్చి నందిగామలో దీక్ష చేస్తున్న వారికి ఆయా గ్రామస్తులు సంఘీభావం తెలిపారు.

ఈ ర్యాలీలో శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణంలో వారికి సంఘీభావం తెలిపిన అనంతరం దేవినేని మాట్లాడుతూ పండుగ రోజు సైతం పస్తులతో నిరసన దీక్షలు చేపడితే అమరావతి ద్రోహులు సిగ్గుపడాల్సింది పోయి పండుగ సంబరాలు చేస్తున్నారని నాడు జై ఆంధ్ర ఉద్యమానికి వసంత నాగేశ్వరరావు ద్రోహం చేస్తే నేడు అమరావతి ఉద్యమానికి వసంత కృష్ణ ప్రసాద్ ద్రోహం చేస్తూ అమరావతి ద్రోహిగా నిలబడ్డాడని హైదరాబాదులోని తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి తన వ్యాపార దృక్పధాన్ని చాటి చెప్పాడని గడిచిన ఏడునెలల్లో విశాఖలో భూములు కొనుగోలు చేసి రానున్న ఆరునెలల్లో వాటిని అమ్ముకునేందుకు వ్యాపార దృష్ట్యా వ్యవహరిస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. ఇటువంటి అమరావతి ద్రోహులను ప్రజల దూరంగా పెట్టాలని ఈ ఉద్యమానికి సహకరించని ప్రతి ఒక్కరూ అమరావతి ద్రోహులే అని దేవినేని అన్నారు.

ఫెర్రీ వద్ద శంకుస్థాపన చేసిన ఐకానిక్ బ్రిడ్జ్, దాములూరు-వైకుంటపురం బ్యారేజీ లను రద్దు చేసినందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారో.. అమరావతిని తరలిస్తూ ఈ ప్రాంత ప్రజల గుండెపై తన్నినందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారో.. అమరావతి ద్రోహి వసంత కృష్ణ ప్రసాద్ చెప్పాలని దేవినేని అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ అమరావతిలోనే జరుగుతుందని అమరావతే ఎప్పటికీ ఆంధ్రుల రాజధాని అని దేవినేని అన్నారు.

జేఏసీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో వారు పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.