పదవికోసం పార్టీ విలీనం….
బీజేపీ కార్యానిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కలయిక అంతరమిదేనా..
పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఎంపీ పదవి…
అన్నయ్య బాటలో తమ్ముడు నడుస్తున్నట్టే కన్పిస్తోంది పరిస్థితి. నాడు అన్నయ్య ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా రాజ్యసభ ఎంపీ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించారు. అనంతరం పార్టీ స్థాపించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్టు అర్ధమౌతోంది. ఇప్పటికే ఈ దిశగా ఇరువురి మద్య మంతనాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపధ్యంలో చాలామంది పార్టీని వీడిపోయారు. ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పార్టీని వదిలేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీని నడపడం కష్టసాధ్యంగా మారింది.
మరోవైపు రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ…ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో మూడుసార్లు టీడీపీతో కలిసి పోటీ చేసినప్పటికీ పార్టీ అంతర్గతంగా పెద్దగా బలపడలేదు. దీంతో ప్రజాదరణ కలిగిన ఓ నాయకుడి కోసం ఆపార్టీ ఎదురుచూస్తోంది. కాపు సామాజికవర్గం కూడా ఏపీలో బలంగా ఉండటంతో జనసేన నేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరితే పార్టీ బలపడవచ్చన్నది బీజేపీ నేతల అంచనా. 2014 ఎన్నికల్లో మోదీతో కలిసి బహిరంగసభల్ని కూడా పవన్ పంచుకుని ఉన్నారు. ఇరువురి మద్య పాత స్నేహం నేపధ్యంలో మరోసారి ఆ బంధాన్ని పటిష్టం చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే జనసేనతో టై అప్ రూపంలో కాకుండా…నేరుగా పార్టీని బీజేపీలో విలీనం చేయించే ప్రతిపాదనపై చర్చ నడుస్తోంది. పార్టీని విలీనం చేస్తే…పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చేేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం దిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ స్వయంగా వచ్చి కలిశారు. అమరావతి వ్యవహారంపై కలిసినట్టుగా పైకి చెబుతున్నప్పటికీ.,.అంతర్గతంగా మాత్రం ఇవే మంతనాలు జరిగినట్టు సమాచారం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ాఅంశం కేంద్రం జోక్యం ఉండదని ఇప్పటికే బీజేీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ సంగతి తెలిసి కూడా పవన్ కళ్యాణ్….జేపీ నడ్డాతో సమావేశం జరపడం వెనుక ఉద్దేశ్యాలు మాత్రం పార్టీ విలీనంపై చర్చలేనని తెలుస్తోంది.