ఏపీ స్థానిక సంస్థల బరిలో టీఆర్ ఎస్….?

17న ఈసీ సమావేశం…

టీఆర్ ఎస్  సహా 18 రాజకీయ పార్టీలకు  ఆహ్వానం…

అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీెఆర్ఎస్ బరిలో దిగనుందా…అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపాల్టీ, నగరపాలక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణాలో ఇప్పటికే ముగిసిపోయాయి. ఏపీలో జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ బరిలో దిగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికలపై చర్చించేందుకు ఎన్నికల కమీషన్ ఈ నెల 17 వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది.  ఈ సమావేశానికి టీఆర్ఎస్ , ఎంఐఎం సహా 18 రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఏర్పాటైన భేటీలో పాల్గొనేేందుకు హాజరుకావల్సిందిగా గుర్తింపు పొందినప్రాంతీయ పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా ఈసీ ఈ ఆహ్వానాన్ని పంపింది. అయితే  ఏపీలో కూడా ఎన్నికల్లో దిగుతామంటూ గతంలో టీఎర్ఎస్ నేతలు చేసిన ప్రకటనల నేపధ్యంలో…ఈ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అంతకుమించి గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని విిధ ప్రాంతాల్ని పర్యటించినప్పుడు బ్యానర్లు పోస్టర్లు కట్టి మరీ ఆహ్వానం పలికారు స్థానికులు. ఇక్కడి ప్రజల్లో కూాడా కొద్దిమేర అభిమానముంది.  వాస్తవానికి అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా ఎన్నికల నిర్వహణ చర్చలకు హాజరుకావాలంటూ ఆహ్వానం  అందించడం ఓ సహజమైన ప్రక్రియే.

ఈ సమావేశం 17వ తేదీ 11గంటలకు విజయవాడలోని బందరురోడ్జులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు.

జనసేన పార్టీకి గుర్తింపు పొందిన  పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్‌ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ  ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాేలున్నాయి.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.