అందుకే ‘అల వైకుంఠపురములో..’ చేశా: పూజా హెగ్డే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో అమూల్య క్యారెక్టర్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ..
‘‘బేసికల్లీ ఐ లవ్ ద స్ర్కిప్ట్. త్రివిక్రమ్‌గారు కథ చెప్తుంటే పడిపడి నవ్వాను. పాప్ కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని అనిపించింది. అదివరకు త్రివిక్రమ్‌గారితో చేసిన ‘అరవింద సమేత’ సీరియస్ సబ్జెక్ట్. అలాగే దీనికి ముందు బన్నీ చేసిన ‘నా పేరు సూర్య’ కూడా సీరియస్ సబ్జెక్ట్. అందువల్ల ఫన్నీగా ఉండే ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ సినిమాలో నాది స్ట్రాంగ్ క్యారెక్టర్ అనీ, అల్లు అర్జున్‌కు బాస్‌గా కనిపిస్తావనీ త్రివిక్రమ్‌గారన్నారు. స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన క్యారెక్టర్ అని ఆయన చెప్పడం వల్ల మరో ఆలోచన లేకుండా చేయడానికి ఒప్పుకున్నా. అది స్ట్రాంగ్ క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నా. బన్నీ క్యారెక్టర్ ఆలోచనాధోరణిని మార్చే క్యారెక్టర్. అలాగే ‘సామజవరగమన’ పాటను ఎంతో పొయెటిక్‌గా తీశారు. హీరో పదే పదే నా కాళ్లను చూస్తుంటే, ఒకసారి పైకి చూడమని చెప్తాను. అప్పుడతను నా కాళ్ల మీద నుంచి దృష్టిని మరల్చి నా కళ్లవంక చూస్తాడు. అప్పుడు తన కొలీగ్స్‌తో ‘ఫస్ట్ టైం మేడమ్ కళ్లు చూశాను. మేడమ్ సార్.. మేడమ్ అంతే’ అని చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది..’’ అని తెలిపారు
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.