రేపు ఏం జరగనుంది..భారీ స్కెచ్ వేశారా…

నిజంగా అలా ప్లాన్ చేశారా..

కౌంటింగ్ రోజు ఘర్షణలు జరుగుతాయా…

మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. 43 రోజుల ఉత్కంఠకు తెరపడటానికి. రాజెవరో…పరాజితుడెవరో తేలిపోనుంది. ప్రజలు ఎవరికి పట్టం గట్టారో తెలిసిపోతుంది. పోటీ చేసిన అభ్యర్ధులే కాదు..ప్రతి ఒక్కరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఘడియ వచ్చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ జిల్లాల్లో వేడిని మరింత  పెంచాయి. గెలుపు ధీమా వైసీపీలో కన్పిస్తుండగా…ఓటమి భయం అధికార టీడీపీను వెన్నాడుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ తమకు అనుకూలంగా లేకపోవడంతో కౌంటింగ్‌కు ముందే టీటీపీ అభ్యర్థులు డీలాపడ్డారు.  కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై…సాయంత్రానికి అధికారిక ఫలిలం వెల్లడి కానుంది.

ఓటమి భయం ముందు నుంచీ వెన్నాడుతుండటంతో పోలింగ్ రోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణల్ని సంధించడం ప్రారంభించారు. ఒకరికి ఓటేస్తే మరొకరికి ఓటు పడుతుందంటూ రచ్చ చేయడం పోలింగ్ రోజే ప్రారంభించారు. వీవీప్యాట్లు మొత్తం లెక్కించాల్సిందేనంటూ వాదన తీశారు. కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు బాబుగారికి. ఇక తుది అస్త్రాన్ని సంధించాలని నిర్ణయించేశారు. ఓటమి భయంతో రేపటి కౌంటింగ్ ను వివాదాస్పదం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఎలక్షన్ కమీషన్ వద్ద కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంది కాబట్టే…కౌంటింగ్ ఏజెంట్ల నేర చరిత్రను పరిశీలించాల్సిందిగా ఆయా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

కౌంటింగ్ ను వివాదం చేయాలనుకున్న బాబు…అందుకు అనుగుణంగా కార్యకర్తలకు ఆదేశారు జారీ చేశారట. ముఖ్యంగా ఎన్నికల  ఫలితాల్లో తమకు ప్రతికూలంగా వచ్చే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు నాయుడు పార్టీ భారీ స్కెచ్‌ వేసిందని పక్కా సమాచారం.  టీడీపీ ఏజెంట్ల ద్వారా కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవలు చేయాలని అధికార పార్టీ  నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గొడవలు చేసే మనస్తత్వం, నేర చరిత్ర ఉన్నవారినే ఏజెంట్లుగా పెట్టుకున్నారు. ఓడిపోయిన ప్రతి చోటా రీ కౌంటింగ్‌ చేయాలంటూ డిమాండ్ లేవదీసి ఘర్ఘణలు ప్రేరేపించేలా చేయాలని సంబంధిత ఏజెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.  ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా గొడవలు చేయాలని సూచనలు చేశారు. ఇప్పటికే టీడీపీ ఏజెంట్లకు రెండు సార్లు శిక్షణ ఇవ్వగా, బుధవారం  అంటే ఇవాళ మరోసారి  ఆ పార్టీ ఏజెంట్లు అందరికీ చేయాల్సిన కార్యకమంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏజెంట్‌కు చంద్రబాబు నాయుడు ఫోటోతో ముంద్రించిన ఒక ప్రత్యేకమైన బుక్‌లెట్‌ను కూడా ఇచ్చారు.

దీనికి సంబంధించి ఆ పార్టీ ముందుగానే రెండు ఫిర్యాదు నమూనా పత్రాలను తయారు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ ఫిర్యాదులకు పధకం పన్నారు. ఓడిపోయే చోట ప్రతి రౌండ్‌లోనూ రీకౌంటింగ్‌ కోసం ఘర్షణకు దిగాలని ఏజెంట్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవీఎంలపై నెంబర్లు కనపడలేదని కూడా  ఫిర్యాదు చేయాలని ఏజెంట్లకు సూచించారు. పదేపదే ఫిర్యాదులు చేయడం ద్వారా ఎన్నికల ఫలితాల్లో జాప్యం జరిగేలా చూడాలని ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ తరహా ప్రయత్నాలపై ఇటు ఎన్నికల సంఘం కూడా దృష్టిపెట్టింది. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఎలా చేయాలన్నదానిపై ఆర్‌ఓలు, అబ్జర్వర్లకు ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనుంది. అయినదానికీ కాని దానికీ వివాదం సృష్టించడం ద్వారా కౌంటింగ్ ప్రక్రియను స్థంభింపచేయడం, లేదా ఈవీఎంలను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేయడం లేదా వీవీ ప్యాట్ స్లిప్పుల్ని మాయం చేయడం వంటివాటిపై ఆ పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారట. వీలైనంత వరకూ ప్రతి అంశాన్నీ ఘర్షణకు దారితీసేలా మల్చుకోవాలన్నది ఆ పార్టీ ఏజెంట్ల ముఖ్య ఉద్దేశ్యమట. ఎప్పుడైతే కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు గొడవ రాజేస్తారో…అదే సమయంలో బయట కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో అప్పటికే మొహరించి ఉండే కార్యకర్తలు ఘర్షణలు సృష్టించాలన్నది వ్యూహంలో భాగమని తెలుస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.