జగన్ వైపు యువత…

Teja Vadapalli reports…

యువత జగన్ వైపు నిలబడిందా…

పోల్స్ నివేదికల్లో కూడా అదే తెలిసిందా…

వైఎస్ జగన్. మరి కొన్ని గంటల్లో అధికారాన్ని కైవసం చేసుకోనున్నారనేది ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు.. ఒపీనియన్ పోల్స్ నివేదికలూ, విశ్లేషణలూ అన్నీ వైసీపీకే అధికారమని చెబుతున్నాయి. తొమ్మిదేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కబోతోందన్నది ప్రతి ఒక్కరూ నమ్మే మాట.

అయితే ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో యువత ఎటువైపు ఉన్నదన్నదే ప్రధానంగా చర్చించుకునే మాటైంది. సినీ గ్రామర్ ను చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచారా..లేదా జగన్ వైపు మొగ్గు చూపారా అనే విషయంపై ఎవరి వాదనలు వారి కున్నాయి ఇప్పటి వరకూ. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో, ఒపీనియన్ పోల్స్ నివేదికల్లో వయస్సుల వారీగా విభజించినప్పుడు ఒకే విషయం తేటతెల్లమైంది. అది యువత ఈసారి వైఎస్ జగన్ కు జై కొట్టారనేది. అంతేకాదు జగన్ కోసం యువత నిలబడిందని తేలింది. 51 శాతం యువత జగన్ కు ఓటేయగా…33 శాతం పవన్ వైపు నడిచినట్టు తెలుస్తోంది. సినీ గ్లామర్ ను కాదని యువత జగన్ వైపు నడవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి…

రాష్ట్రంలో చాాలాకాలంగా ఏకత్వ పాలన  నడిచింది. ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తూ పార్టీలు గానీ నేతలు గానీ తమ నిర్ణయాలను సొంత లాభాల కోసం వ్యవహరిస్తూ వచ్చారు. స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి  అత్యవసరమైన ప్రజలకు, యువతకు నిరుద్యోగులకు ఓ వరంగా ఉన్న  ప్రత్యేక హోదాను ఆ నాయకులు, ఆ పార్టీలు విస్మరించాయి. గత 5 ఏళ్లుగా యువత అనేక రకాలుగా నాయకులు చెప్పే అసత్య మాయమాటలకు మోసపోయి.. నిలకడలేని మాటలు చెప్పే వాళ్ళను ఎన్నుకుంది. అదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ  సొంత పార్టీతో 2014 ఎన్నికలకు వెళ్ళే క్రమంలో ఒకే మాట మీద నిలబడిన ఆయన వైఖరి…అప్పటికే ఊసరవెల్లి లాంటి మాటలు మాట్లాడేవాళ్లను నమ్మిన యువతతు నచ్చలేదు.  జగన్ straight forwardness బహుశా రుచించలేదు అప్పట్లో.  అయితే కాలక్రమంలో పరిపాలన జరుగుతున్నప్పుడు తాము చేసిన తప్పేంటో యువతకు అర్ధమైంది. మరోవైపు యువత, నిరుద్యోగులు పడిన బాధలను గమనించి ఎప్పుడైతే ప్రత్యేక హోదా కోసం ఒకే మాట మీద జగన్ నిలబడటం, ఉద్యమాలు చేయడం చూసిన యువతకు 2014 లోఅనవసరంగా వదులుకున్నామనే ఆవేదన కలిగింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్ధపూరితంగా సమయానుకూలంగా మాటలు మార్చేస్తూ..ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ పాలన సాగిస్తుండటం అదే యువత గమనించింది. నాడు నిరుద్యోగ యువత ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయించి, అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా…స్వలాభం కోసం రాష్ట్రానికి జరగాల్సిన మేలును వదిలేసిన చంద్రబాబు వైఖరినీ ప్రత్యక్షంగా చూశారు.  ప్రజల్ని ఏనాడూ పట్టించుకోని నేతలను, చంద్రబాబు మాయమాటలను ఎల్లోమీడియా చూపించకపోయినా…ఇవాళ సోషల్ మీడియా ద్వారా నిజస్వరూపాలన్నీ చూసారు. ఇక ఆప్పట్నుంచి యువతలో మార్పు రావడం ప్రారంభమైంది. తమకు కావల్సిన నాయకుడు మాటలు మార్చేవాడు కాదు.. రాష్ట్ర అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పన దిశగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటకు కట్టుపడి ఉండేవాడు కావాలని యోచించారు. అదే క్రమంలో కేవలం సినీ గ్రామర్ తో ఎన్నికల్లోకి వచ్చి..అదే అధికార పార్టీతో గత ఎన్నికల్లో మద్దతిచ్చిన పవన్ ను నమ్మలేకపోయింది యువత. ప్రత్యామ్నాయంగా తమ కోసం పోరాడుతున్న…నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్న జగన్ వైపు యువత ఆకర్షితమైంది. మాట ఇస్తే మడం తిప్పడు అని తెలుసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ తమ పార్టీ వాళ్లకే పట్టం గట్టిన ప్రభుత్వ వైఖరిని చూశారు. అయితే తన ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు జగన్ చేసిన వాగ్దానాలు పెద్దగానే ఆకర్షించాయని చెప్పవచ్చు.  తమ మేనిఫెస్టోలో సైతం అదే విషయాన్ని పొందుపర్చారు జగన్. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టునూ నిరుద్యోగ యువతకే ఇస్తామనడం యువతలో మార్పుకు కారణమైంది. తమ కోసం విద్యార్థుల కోసం, ప్రజల కోసం జగన్ ఆలోచిస్తున్నాడనే భావన కలిగంది. ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధికంగా యువకుల్నే ఎన్నికల్లో నిలబెట్టడం కూడా మరో కారణం. ఈ అన్ని కారణాల్ని గమనించిన యువత ఈసారి పెద్ద ఎత్తున జగన్ కు మద్దతు పలికారన్నది ఇప్పటివరకూ వెలువడిన విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చి చెప్పాయి. కౌంటింగ్ నాటికి ఇది మరింతగా స్పష్టమై…యువత జగన్ కోసం నిలబడిందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరుతారు.  అదే యువత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటోందన్నది కూడా అంతే నిజం….

Report by….Teja vadapalli

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.