వన్ ప్లస్ 7 ప్రొ….ఫీచర్లు సూపర్…

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న వన్ ప్లస్ 7 ప్రొ ఫీచర్లు..

త్వరలో మార్కెట్లోకి…

ఇప్పటికే పదివేల రూపాయల భారీ తగ్గింపుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న వన్ ప్లస్ సంస్థ..ఇప్పుడు మరో వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. వన్ ప్లస్ 7 ప్రొ పేరుతో విడుదల కానున్న ఈ మోడల్ మొబైల్ ఫీచర్లు అదిరిపోయాయి. ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి కూడా.

చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్‌ ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ 6 కు సక్సెసర్‌గా  వన్‌ప్లస్‌ 7ను  ఈ నెలలో ఆవిష్కరించనుంది ఈ సంస్థ. ఫాస్ట్‌ అండ్‌ స్మూత్‌ ట్యాగ్‌తో మార్కెట్లో వస్తున్న ఈ ఫోన్ కు సంబంధించిన  టీజర్ ను ఆ సంస్థ సీఈవో పీట్‌ లౌ విడుదల చేశారు. వన్‌ప్లస్‌ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్‌ అండ్‌ స్మూత్‌ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఫైనల్ గా వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను కంపెనీ బెంగుళూరులో మే 14న జరిగే ఈవెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీఈఓ విడుదల చేసిన టీజర్‌  వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో, వన్‌ప్లస్‌ 7 ప్రో 5జీపేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుందన్న అంచనాలకు బలాన్నిస్తోంది.

వన్‌ప్లస్‌ 7 ప్రొ ఫీచర్లు ఇవే…

6.7 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
3120×1440 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
6/12 జీబీ ర్యామ్, ‌128/256 జీబీ స్టోరేజ్‌,
48+8 ఎంపీ  డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
16  ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఈ ఈవెంట్లో పాల్గొనాలనుకున్నవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఓచర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. అలాగే  మే 4 నుంచి వెయ్యి రూపాయలతో ప్రీ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ బుకింగ్‌ ద్వారా 15వేల రూపాయల  స్ర్కీన్‌ రిప్లేస్‌మెంట్‌ సదుపాయం ఆరు నెలల వరకు ఉచితమని సంస్థ ప్రకటించింది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.