ఆ ఫోన్ కొంటే..ఏకంగా 10 వేల తగ్గింపు…

భారీ తగ్గింపు ఆఫర్ తో వన్ ప్లస్ మొబైల్…

పదివేల వరకూ తగ్గింపు…

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కైవసం చేసుకునేందుకు వన్ ప్లస్ ప్రయత్నిస్తోంది. ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా ప్రాచుర్యం పొందిన వన్ ప్లస్ తాజాగా…భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ సంస్థ లేటెస్ట్ ఎడిషన్ ధరను సమ్మర్ సేల్ లో భాగంగా 9 వేలు నేరుగా తగ్గించేసింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు జరిపితే మరో 15 వందల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుందట. అంటే ఒక్క మొబైల్ కొంటే ఏకంగా పదివేల 5 వందల రూపాయల తగ్గింపన్న మాట.

అమెజాన్‌ సమ‍్మర్‌ సేల్‌ లో భాగంగా వన్‌ప్లస్‌ 6టీ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ పై ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. గతంలో అమెజాన్‌ ఫ్యాబ్‌ సేల్‌లో 3 వేలు తగ్గించిన సంస్థ తాజాగా ఈ తగ్గింపును ప్రకటించింది.  ప్రస్తుతం వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌ రూ.31,499లకు లభిస్తోంది.  అద్భుతమైన ఫీచర్లతో గత అక్టోబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  కాగా  మే 14న  వన్‌ప్లస్‌ 7 పేరుతో మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ కానుంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.