ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు…జగన్

అల్లాహ్ దీవెనలు లభించాలి….జగన్

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ ప్రారంభం సందర్భంగా వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ముస్లిం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు మంచి జరగాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ పవిత్ర మాసాన్ని జరుపుకుంటారని…వారికి ఈ సందర్భంగా అల్లాహ్ దీవెనలు లభించాలని జగన్ కోరారు.

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని జగన్ పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు కూడా ఇదే నెలలో వెలువడనుండటం ఓ శుభ పరిణామమని జగన్ చెప్పారు. రంజాన్ పండుగ నాటికి అల్లాహ్ ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆకాంక్షించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.