విమానంలో మంటలు…41 మంది మృతి

అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలు..

41మంది సజీవ దహనం..10 మందికి గాయాలు..

మాస్కోలో ఘటన

రష్యా రాజధాని మాస్కోలో ఘోరమైన దుర్ఘటన చోటుచేసుకుంది. ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలతో..ప్రయాణీకులు 41మంది సజీవంగా దగ్దమయ్యారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలను పరిశీలిస్తే…

మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం 78 మందితో టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన కాస్సేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్ారమంలో విమానం నేలను బలంగా తాకడం వల్ల మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ అవుతున్న క్రమంలో మంటలు రేగడంతో ప్రయాణీకులు తప్పించుకోలేకపోయారు. 41మంది సజీవంగా దహనం కాగా..అందులో ఇద్దరు చిన్నారులున్నారు. మరో పదిమందికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందువైపు ద్వారం నుంచి బయటపడ్డారు.

ఇదిలా ఉంటే టేకాఫ్ కు కారణమైన సాంకేతిక లోపమేదో ఇంకా తెలియలేదు. టేకాఫ్‌ అయిన తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు విమానం మాస్కోలో రెండు సార్లు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్‌ రాడార్‌ 24 పేర్కొంది. దీనిపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భద్రతా నియమాలను పైలట్లు ఏమైనా ఉల్లంఘించారా? వంటి అంశాలపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తదితరులను విచారిస్తామని కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.