శెహభాష్ రెహమాన్…ఆ హీరోలు కూడా నేర్చుకోండి

రెహమాన్ ని చూసి ఆ బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలి..

అనుపమ్ ఖేర్ నుంచి..అక్షయ్ వరకూ

చెప్పేవి దేశభక్తి మాటలు..చేసేవి విదేశీ వ్యవహారాలు…

దేశభక్తి ఇప్పుడు మార్కెట్లో వస్తువైపోయింది. ఎవరికి తోచినరీతిలో వారు మార్కెట్ చేసుకుంటారు. పైకి శ్రీరంగ నీతులు చెబుతూనే విదేశీ వ్యవహారాల చేసేవాళ్లు ఎక్కువైపోయారు. దేశంలో దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకుంటూనే విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతుంటారు ఆ బాలీవుడ్ హీరోలు. దేశభక్తి తమకే సొంతమన్నట్టు చెప్పుకుంటారు…కానీ విదేశీ పౌరసత్వాలు మాత్రం వదులుకోరు. పైగా ఏదో కనికరం చూపిస్తున్నట్టు ట్యాక్స్ లు కడుతున్నాం అంటారు…అదే దేశభక్తికి నిదర్శనమంటారు…

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వ్యవహారం ఇదే. కెనాడా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారతను. మొన్నటి వరకూ గోప్యంగా ఉంచి..చివరికి ఒప్పుకోక తప్పలేదు. మోడీతో చేసిన నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూతో వార్తల్లో కెక్కిన అక్షయ్ కుమార్ చాలాసార్లు దేశభక్తి గురించి..దేశం గురించి గొప్పలు చెప్పుకుని ఉన్నారు. అంతేకాదు..ఇతరుల గురించి నీతులు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవల్సిందిగా విజ్ఞుప్తి చేశారు. అదే సమయంలో తాను మాత్రం ఓటేయలేదు. ఇదే విషయంపై ఆరాతీస్తే..కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారని బయటకు వచ్చింది. ఇదే విషయంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టేసరికి అంగీకరించకతప్పలేదు అక్షయ్ కు. కెనడా పౌరసత్వం కలిగి  ఉండటం తప్పా కాదా అనేది పక్కన పెడితే..జన్మత వచ్చింది మాత్రం కాదు. ఆ దేశం పై ప్రేమతో…తీసుకున్నది మాత్రమే ఆ పౌరసత్వం. మరి అటువంటప్పుడు దేశభక్తి గురించి ఇతరులకు నీతివాక్యాలు చెప్పడమెందుకనేదే అసలు ప్రశ్న. పైగా ఈయనగారికి మరో బాలీవుడ్ నటుడు, బీజేపీ అభిమాని అనుపమ్ ఖేర్ వత్తాసు పలకడం కూడా. తనకు కెనడా పౌరసత్వం ఉన్నా సరే…ఈ దేశంలోనే ఉంటున్నానని…ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నానని ట్వీట్ చేయడం మరో వివాదానికి కారణమైంది. ఈ దేశంలో సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ ట్యాక్స్ కట్టక..కెనడా కు కడతారా అంటూ ట్వీట్లు మొదలయ్యాయి. ఏ దేశంలో సంపాదిస్తే ఆ దేశానికే ట్యాక్స్ కు కట్టాలన్నది కనీస ప్రాధమిక విషయం. దీన్ని గొప్పగా చెప్పుకోవల్సిన అవసరమే లేదు.

ఇటువంటి నటులున్న నేపధ్యంలో అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు శెహభాష్ చెప్పాల్సిందే.  అందరూ విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతున్నప్పుడు, వదులుకోడానికి ఇష్టపడనప్పుడు రెహమాన్ మాత్రం కెనడా దేశ పౌరసత్వాన్ని కాదనుకున్నారు.  రెండేళ్ల క్రితం  పౌరసత్వాన్ని ఇస్తానని కెనడా ముందుకొచ్చినా.. ఎలాంటి అరమరికలు లేకుండా వద్దని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ‘సంగీత తుపాను’ ఏఆర్‌ రెహమాన్‌. రెండేళ్ల క్రితం కెనడా మేయర్… ఏఆర్‌ రెహమాన్‌కు చట్టబద్ధంగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు ఏఆర్‌ రెహమాన్‌ ఏ మాత్రం ఒప్పుకోలేదు. కెనడా మేయర్ నాకు పౌరసత్వాన్ని ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆయనకు రుణపడి ఉన్నా. కానీ తమిళనాడులో చాలా సంతోషంగా ఉన్నా. భారతదేశమే నా కుటుంబం. స్నేహితులు, నా ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీరు ఇండియాకు వచ్చేటప్పుడు తప్పకుండా నా సంగీత కళాశాలకు ఒక సారి విచ్చేయండి. ఇండియా, కెనడా సంయుక్త ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నానంటూ సున్నితంగానే తిరస్కరించారు.  ఏఆర్‌ రెహమాన్‌ స్పందన ఆయన దేశభక్తికి అద్దం పడుతోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇదీ దేశభక్తి అంటే. అంతేగానీ…విదేశీ పౌరసత్వాన్ని కలిగుండి..దేశంలో నీతివాక్యాలు చెప్పుకోవడం కాదు. బాలీవుడ్ హీరోలు కాస్త నేర్చుకోండి…

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.