జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్…

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా…

ఆయన సర్వే ఏం చెబుతోంది…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు మరో మూడు వారాల వ్యవధి మాత్రమే మిగిలింది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రిటర్న్ గిఫ్ట్ పై కేసీఆర్ చేసిన ప్రకటనలు అప్పట్నించీ కలకలం రేపుతూనే ఉన్నాయి. రాజకీయంగా సంచలమైన ఈ వ్యాఖ్యల్ని ఆధారం చేసుకుని ఆంధ్రాలో లబ్ది పొందాలని కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నించింది. ఇప్పుడు ఆంధ్రా ఎన్నికలు ముగిశాక…ఆ వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి కారణం జగన్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానున్నానని కేసీఆర్ చెప్పడమే…ఎందుకంటే ఆ రిటర్న్ గిఫ్ట్ బహుశా ఇదేనేమో  అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానున్నానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు..చంద్రబాబుకు తన రిటర్న్ గిఫ్ట్ ను వందశాతం పూత్తి చేయబోతున్నానని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇంత కచ్చితంగా, విశ్వాసంగా చెప్పడానికి కారణం ఆయన చేయించుకున్న సర్వేలేనని తెలుస్తోంది. సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇదే బహిర్గతం చేస్తోందని ఆయన వెల్లడించారట. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో ఎటువంటి జోష్ నింపాయో లేదో కానీ…అసలే ఓటమి భయంతో ఉన్న తెలుగుదేశం నేతలకు ఇంకాస్త బీపీ పెంచినట్టైంది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారట. ఇప్పటికే విజయం మీద ధీమాతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు కేసీఆర్ వ్యాఖ్యలు మరింత ఉత్సాహాన్ని నింపాయి. పక్కా సమచారం లేకుండా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంతలా వ్యాఖ్యనాలు చేయరనేది పరిశీలకుల మాట.

కేసీఆర్ సైతం జోష్ లో ఉండటానికి కారణం కూడా ఉంది. చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పూర్తవుతుంది ఓ వైపు. మరోవైపు తాను లీడ్ తీసుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు  బలం కూడా చేకూరనుండం ముఖ్య కారణం. ఎందుకంటే జగన్ కూడా కేసీఆర్ లానే…బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని కోరుకుంటుండటం గమనించాల్సిన విషయం మరి.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.