హే సీబీఎన్..వేర్ ఈజ్ డెమోక్రసీ

వర్మకు భయపడుతున్న ప్రభుత్వం..

ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకట్ట..తిరిగి హైదరాబాద్ కు తరలింపు

లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబును తీవ్రంగా భయపెడుతున్న సినిమా. సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రమిది. అందుకే ఎన్నికల ముందు ఏపీలో విడుదల కాకుండా అడ్డుపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో స్టేలు లేకపోవడం, ఏపీలో ఎన్నికల ముగిసిపోవడంతో ఇక విడుదలకు మార్గం సుగమమైంది. మేడే రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు వర్మ రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏపీ వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్యంటూ వర్మను తిరిగి పంపించేశారు హైదరబాద్ కు.

అసలేం జరిగింది…

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేద్దామనుకుని విజయవాడకు వచ్చారు. అయితే ఆ ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరించిన  పోలీసులు ఆయన్ను గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే నిర్భంధించారు. విజయవాడ రావడానికి వీల్లేదని..తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై విజయవాడ పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని, అందువల్ల ప‍్రెస్‌మీట్‌ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వర్మ ప్రెస్ మీట్  నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన‍్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌మీట్‌ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని వర్మను కోరారు.

ఏపీ పోలీసుల ఈ చర్యను దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో ఉండకుండా వెళ్లిపోవాలంటూ పోలీసులు తమపై బలవంతంగా వెనక్కి పంపించారని ఆయన మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయం లాంజ్‌లోనే వర్మతో పాటు నిర్మాత రాకేష్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని… తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.‘నేనేమైనా ఉగ్రవాదినా… నన్ను ఎందుకు నిర్బంధించారు. నిర్బంధించడానికి ఎలాంటి హక్కు, అధికారం ఉంది.’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నలకు మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వలేదు. తన నిర్బంధంపై రాంగోపాల్‌ వర్మ…. ‘నేను నిజం చెప్పేందుకు యత్నిస్తే ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ‘హే సీబీఎన్‌..వేరీజ్‌ డెమోక్రసీ’ అంటూ వర్మ ట్విటర్‌లో సూటిగా ప్రశ్నించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.