బెదిరింపులకు దిగిన బాబు…

ఫ్రస్టేషన్ లో బాబు..ఈసీకు బెదిరింపులు…

అంత ఈజీగా వదిలిపెట్టనంటూ వార్నింగ్…

ఓటమి భయం ఫ్రస్టేషన్ కు నెడుతుంది. ఆ ఫ్రస్టేషన్ లో ఏం చేస్తున్నామో…ఏం మాట్లాడుతున్నామో అర్ధం కాదు. సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటాం. ఇప్పుడిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పద్ధతి.  తన వైఖరిని ఇంకోసార బయటపెట్టుకున్నారాయన. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు దిగారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన చంద్రబాబు సహనం కోల్పోయారు. ఎన్నికల సంఘంపై అక్కసు వెళ్లగక్కారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారంటూ దురుసుగా ప్రవర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ద్వివేదితో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు… తీవ్ర స్వరంతో  బెదిరింపు ధోరణిలో వాదనకు దిగారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చనే ధోరణిని నరనరానా జీర్ణించుకున్న చంద్రబాబు…పోలింగ్‌ మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నా తన అధికార దర్పాన్ని ఏమాత్రం వదలలేదు.  ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది..

ఈసీతో బాబు వాగ్వాదం…బెదిరింపులు ఇవే…

చంద్రబాబు : ఈజ్ వెరిఫయింగ్ ది ఫ్యాక్ట్స్‌ అండి‌.. ఐ యామ్‌ ఆస్కింగ్‌.. యు హావ్‌ టు వెరిఫై.. అదర్‌వైజ్ వుయ్‌ విల్‌ వెరిఫై‌. లెట్‌ దెమ్‌ వెరిఫై.. దెన్‌ ఐ విల్‌ ఫైట్‌ ఇన్‌ ఢిల్లీ.. దెన్‌ ఎందుకు మీ ఆఫీస్‌ ఎందుకు ఇంకా.. క్లోజ్‌ చేయండి.. హు ఈజ్‌ ఎలక్షన్‌ కమిషన్‌.. నేను అడుగుతున్నా.. సరిగా కండక్ట్‌ చేయలేకపోతే.. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకోండి మీరు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్లు. మేమంతా ఇంట్లో పడుకుంటాం.. ఎందుకు నేను కష్టపడాలి.. ఎందుకు ఈ మీటింగ్‌లు మాకు.. ఏం అవసరం లేదు..మేం అడిగేదేంటి.. మీరు ఇండిపెండెంట్‌ అథార్టీ అవునా? కాదా? ఢిల్లీ చెప్పినట్టు మీరు యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఎందుకు ఫాలో కావాలి.
ద్వివేది : హైకోర్టు.. అలాంటిది లేదు..
చంద్రబాబు : లేకపోయినా.. నేను ఏమంటానంటే.. మీ కాన్షియస్‌ ఒకటి ఉంది కదా.. ఐ యామ్‌ ఆస్కింగ్‌..  యు ఆర్‌ నాట్‌ ఏ పోస్ట్‌ ఆఫీస్‌.. యు ఆర్‌ హావింగ్‌ పవర్‌.. ఏమైనా ఉంటే అబాలిష్‌ చేసేయమనండి.. వాళ్లని.. మిమ్మల్ని అందిర్నీ తీసేయమనండి.. ఆయన్నే ఓ క్లర్క్‌ను పెట్టుకోమని చేయమనండి మేం చూస్తాం.. రేపు ఎలక్షన్‌ కమిషన్‌ ఏంటో.. ఇవన్నీ నేను చెబుతున్నా..అంత ఈజీగా వదిలిపెట్టను నేను టేకప్‌ చేశానంటే లాజికల్‌గా పోవాల్సిందే.

సాక్షాత్తకూ ఎన్నికల కమీషనర్ తో ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు బాబు వైఖరిపై. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ సంస్థపై ఇలా బెదిరింపులకు దిగడం సమంజసం కాదంటున్నారు. ఓటమి భయంతోనే బాబు అలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

Spread the love
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares
 •  
  61
  Shares
 • 61
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.