మాధవ్ కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది..

హిందూపురం వైసీపీ అభ్యర్ధిని రిలీవ్ చేయని ప్రభుత్వం…

ఈసీకు ఫిర్యాదు చేసిన గోరంట్ల మాధవ్…

హిందూపురం సమస్య ఇంకా తేలలేదు. కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వస్తూనే సంచలనం రేపారు. జేసీ దివాకర్ రెడ్డి మీద మీసం మెలేసి సవాల్ విసిరిన ఆయన కొద్దిరోజుల్లోనే రాజకీయాల్లో ప్రవేశించి వైసీపీ  హిందూపురం పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలో దిగారు. రాజీనామాను ఆమోదించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందిప్పుడు.

జేసీ దివాకర్ రెడ్డిని మీసం మెలేసి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్ ఆ సామాజికవర్గంలో హీరోగా నిలిచారు. అనంతరం కొద్దిరోజులకు అంటే గతేడాది డిసెంబర్ 30న ఉద్యోగానికి రాజీనామా చేశారు. సర్వీస్ ఇంకా ఉన్నందున వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం  ఆ అభ్యర్ధనను పట్టించుకోకుండా తొక్కిపెట్టింది. హిందూపురం పార్లమెంట్ అభ్యర్దిగా బరిలో దిగుతున్నారని తెలుసుకుని…నామినేషన్లో అడ్డంకులు సృష్టించాలనే పధకంతో ఆ రాజీనామాను ఆమోదించకుండా పక్కనబెట్టింది ప్రభుత్వం. దాంతో తనను తక్షణం రిలీవ్ చేయాలంటూ మాధవ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దాంతో ఆగ్రహించిన ట్రిబ్యునల్ రాజకీయాలతో రాజీనామాను ఆమోదించకపోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది. తక్షణం మాధవ్ ను రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే…ఆ ఆదేశాల్ని పాటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. తనను విధుల్నించి రిలీవ్ చేయాలన్న కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా డీఐజీ తప్పించుకని తిరుగుతున్నారంటూ మాధవ్ ఆగ్రహించారు.

అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిపి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రీలీవ్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పోలీస్‌ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడం దుర్మర్గమన్నారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్టన్‌లో డీఐజీ పని చేస్తున్నారని మాధవ్‌ ఆరోపించారు. ఐపీఎస్‌ అధికారులు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదని, డీజీ, కర్నూలు డీఐజీ తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు మాధవ్‌ వెల్లడించారు.

హిందూపురం పార్లమెంట్ పరిధిలో అధిక సంఖ్యలో ఉన్నవి కురుబ సామాజికవర్గం ఓట్లు. జేసీపై సవాల్, వైసీపీలో హిందూపురం టికెట్ లభించడంతో ఆ వర్గంలో భారీ చీలిక వచ్చింది. దాదాపు 80 శాతం కురుబ సామాజికవర్గం వైసీపీ వైపు మళ్లింది. మెజార్టీ ఓటు బ్యాంకు మళ్లడంతో టీడీపీ విజయం సందేహంగా మారింది. అందుకే గోరంట్లను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచనతోనే రాజీనామాను ఆమోదించకుండా తిప్పలు పెడుతోంది ప్రభుత్వం.

Spread the love
 • 196
 •  
 •  
 •  
 •  
 •  
  196
  Shares
 •  
  196
  Shares
 • 196
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.