లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్…

తెలుగుదేశంకు మరో ఇబ్బంది…29న విడుదల కానున్నచిత్రం..

అభ్యంతరాన్ని కొట్టివేసిన హైకోర్టు…

సరిగ్గా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మరో ఇబ్బంది వచ్చి పడుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెర కెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 29న విడుదల కానుంది. అభ్యంతరాలున్నాయంటూ సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలను ఆపాలని…ఎన్నికల సమయంలో విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పిటీషనర్ కోర్టుకు తెలిపాడు.

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రతి వ్యక్తికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని స్పష్టం చేసింది కోర్టు. ఈ విషయమై దాఖలైన పిటీషన్ ను కొట్టివేసింది. రెండు సినిమాల్లో ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే మాత్రం వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. తెలంగాణాలో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని..శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు. దాంతో సినిమా విడుదలకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు వర్మ దర్శకత్వం వహించగా, లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకుడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను ముందుగా ఈ నెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేసినా.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో ఈనెల 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్‌ వీరగ్రంథం మార్చి 22నే రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

చిత్రం నిర్మాణ సమయంలోనే వివాదాస్పదమైంది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలు, వైశ్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ ను చెప్పులు, రాళ్లతో కొట్టించిన దృశ్యాలు, ఎన్టీఆర్ అల్లుడి చేతిలో ఎదుర్కొన్న అవమానాలు అన్నీ వర్మ అతి జాగ్రత్తగా సినిమాలో తెరకెక్కించారు. ఈ దృశ్యాలే తెలుగుదేశం పార్టీకు ఇప్పుడు ఇబ్బందిగా మారబోతున్నాయి. విడుదలకు ముందే సంచలనమైన చిత్రం…విడుదలైతే ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది.

Spread the love
 • 327
 •  
 •  
 •  
 •  
 •  
  327
  Shares
 •  
  327
  Shares
 • 327
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.