ఏ జర్నీ టు జనసేన వయా టీడీపీ…

చివరకు పయనమటే అని తెలుసుగా…

నేరుగా కుదరదని…ముసుగు స్నేహితుడి చెంతకు..

జనసేనకు జేడీ…

నేరుగా కాకపోతే చాటుగా దెబ్బేశేయ్. ఇదీ ఆ వ్యక్తి సిద్ధాంతం. రాజకీయాలే దూరదృష్టిగా వృత్తిని తాకట్టు పెట్టి పాపులర్ అయ్యాడు. వివేకానంద సూక్తులు వల్లిస్తూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఏదో పార్టీ పెడదామని ప్రయత్నించి విఫలమయ్యాడు. పార్టీ పెట్టే కంటే ఇద్దరు మిత్రుల్లో ఒకరిని ఎంచుకుందామనుకున్నాడు. ఒకడు నేరుగా మిత్రుడు. మరొకడు మిత్రుడికి రహస్య స్నేహితుడు.

స్నేహితుడి వద్దకు వెళదామనుకున్నాడు. అంతా సిద్ధమైంది. ఆలోచన ఖరారైంది. ఆ స్నేహితుడి అధికార పత్రికలో పతాకశీర్షికగా వార్త వచ్చింది. అందులో వాళ్ల గురించి వచ్చిందంటే ఇక నిజమే కదా మరి. అయితే ఈ వార్త దావాలంలానే వ్యాపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ లేని అత్యుత్సాహం ప్రదర్శించి కేసుల వంకతో జగన్ ను టార్గెట్ చేసి…ఎప్పటికప్పుడు ఎల్లోమీడియాకు లీక్ లు ఇస్తూ పతాక శీర్షికలకెక్కాడు. చాలా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో పేరు సంపాదించుకున్నాడు. పేరు సంపాదించుకున్నాడంటే గుర్తొస్తుంది ఇదే రహస్య స్నేహితుడు సిినిమా.

ఈ సినిమాలో బ్రహ్మానందంను కామెడీ చేయడానికి …పవనుడు వీరుడూ…శూరుడూ వీరాధివీరుడూ అంటూ పేరడీ పాటందుకుంటాడు. ఇప్పుడా పాటే గుర్తొస్తోంది. ఈ పచ్చని మాజీ అధికారిని చూస్తుంటే. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వివేకానంద సూక్తులు వల్లించడం మొదలెట్టాడు యువతను ఆకర్షించే ప్రయత్నంలో బాగంగా. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అధికారపత్రికలో అదే వార్తగా వచ్చింది. అంతే…అక్కడే ప్రారంభమైంది అసలు సంగతి. ముసుగు తొలగిందని…ఈ మాట ముందే తెలుసని…జేడీ, బాబులిద్దరూ తోడుదొంగలని…ఇంకా ఎన్నని చెప్పుకోవాలి. విపరీతమైన ట్రోలింగ్ ప్రారంభమైంది ఇతనికి వ్యతిరేకంగా. కేవలం నాలుగైదు రోజుల్లోనే చాలా అన్ పాపులర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందనుకున్నాడు. మిత్రుడు మరో పధకం వేశాడు. నేనే ఉండాలేంటీ…నా రహస్య స్నేహితుడున్నాడుగా అంటూ రహస్యం చెప్పేశాడు. దాంతో సూపర్ అనుకున్నాడు. ప్రజలకేం తెలుస్తుంది వెర్రోళ్లనుకున్నాడేమో…తమ రహస్య మంతాంగనాలు వాళ్లకు తెలియవనుకున్నారు. ఆ రహస్య స్నేహితుడిని కలిసేశారు.

పవన్ ను కలిసిన జేడీ…

ఇంకేం అనుకున్నదే తడవుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు జగన్. ఆదివారం ఉదయం 10న్నర గంటలకు ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు జనసేన అధినేత పవన్‌తో లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని ప్రకటించారు. లక్ష్మీనారాయణతో పాటు ఎస్‌కేయూ మాజీ ఉపకులపతి రాజగోపాల్‌ కూడా జనసేనలో చేరనున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇప్పటికే అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది.

ఆడుకాకపోతే ఈడు. ఇద్దరూ నా వాళ్లేగా. ఇద్దరూ రహస్య స్నేహితులే కదా. ఎవరిదక్కరకు వెళ్తే ఏముంటుందనుకున్నాడో ఏమో ఆ వ్యక్తి…టక్కున చేరిపోతున్నాడు. నేరుగా కుదరడం లేదని రహస్యంగా రహస్య స్నేహితుడి చెంతకు చేరిపోతున్నాడు. ఇంతకంటే డర్టీ పొలిటిక్స్ ఉంటాయా….

Spread the love
 • 438
 •  
 •  
 •  
 •  
 •  
  438
  Shares
 •  
  438
  Shares
 • 438
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.