ఎన్నికల శంఖారావంలో జగన్ తీవ్ర విమర్శలు…

కాకినాడ ఎన్నికల శంఖారావంలో జగన్ ప్రసంగమేంటి…

నరేంద్రమోదీపై చేసిన విమర్శలేంటి…
ప్రతి గ్రామంలో బీజేపీ చేసిన మోసాల గురించి ఏం చెప్పమన్నారు…

ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతూనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. డప్పుకొట్టి..ప్రచార నగారా మోగించారు. తూర్పు మార్పునకు సంకేతమనే సెంటిమెంట్ ఆధారంగా కాకినాడ సమర శంఖారావం సభను ఎన్నికల శంఖారావంగా మార్చారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర్ర ప్రజల్ని టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ లు ఎలా మోసం చేశారో వివరించారు స్పష్టంగా. గ్రామ గ్రామాల్లో..పట్టణాల్లో
చంద్రబాబు, నరేంద్రమోదీ చేసిన మోసాల గురించి ప్రజలకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో విశదీకరించారు జగన్.

డేటాచోరీ ఉదంతంపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. లేని ఓట్లను చేర్పించడమే బాబు పని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో భయం లేకుండా స్వచ్ఛందంగా బూత్ ల వద్దకు వెళ్లి ఓటేసే పరిస్థితి ఉందా అనే చర్చను గ్రామాల్లో పెట్టమని సూచించారు. ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేసిన మోసగాడని..ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని జగన్ మండిపడ్డారు. ఓటుకు కోట్లిస్తూ అడ్డంగా దొరికిన నేరగాడని..చివరికి ప్రజలు తనకు ఓటేయరనుకుంటే..ఆ ఓట్లను కూడా తీయించేసే మోసగాడని జగన్ దుయ్యబట్టారు.వ్యవస్థల్ని దారుణంగా నిర్వీర్యం చేసే వ్యక్తిగా..సైబర్ క్రిమినల్ గా అభివర్ణించారు. మీ వ్యక్తిగత వివరాల్ని, ఆధార్ వివరాల్ని, బ్యాంకు అక్కౌంట్ వివరాల్ని దొంగిలించడానికి ముఖ్యమంత్రెవరసలు..అతనికి ఆ అధికారమెవరిచ్చారు..ప్ర్రైవేటు కంపెనీలకు మీ వివరాలు ఎలా అందించారు..అనే అంశాలపై పజల్లో చర్చ పెట్టమని కార్యకర్తలకు జగన్ సూచనలు చేశారు. ఒకరి వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, ఓట్లను తొలగించడమన్నది జైలుకు పోయే నేరాలుగా జగన్ చెప్పారు. ఈ అంశాలపై ప్రజల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో చర్చలు జరపండంటూ ఆదేశించారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, పవన్ మోసంపై ఎవరి పాత్ర ఎంతుందో క్షుణ్ణంగా వివరించారు.

ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని చంద్రబాబు అన్నాడు..సంజీవనా అని వెటకారమాడాడు. ప్యాకేజ్ ముద్దన్నాడు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. విడాకులిచ్చాక..ఎన్నికల వస్తున్నాయని చెప్పి నల్ల చొక్కాలతో దీక్షల డ్రామాలాడుతున్నాడంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి గ్రామాల్లో చెప్పమన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా హోదాను చట్టంలో పెట్టకుండా చేసిన అన్యాయంపై చెప్పండంటూ కార్యకర్తల్ని సూచించారు.

నరేంద్రమోదీపై జగన్ విమర్శలు…

మరీ ముఖ్యంగా బీజేపీపై…ఆ పార్టీ చేసిన మోసంపై కూడా చెప్పండి గ్రామాల్లో పట్టణాల్లో…ఇదే బీజేపీ, ఇదే నరేంద్రమోదీ పార్లమెంట్ లో మనకు చెప్పిన మాటేంటి..ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్ నే సాక్షిగా చేసి మాటిచ్చారు. ఇదే నరేంద్ర మోదీ వాళ్ల మేనిఫెస్టోలో హోదా ఇస్తామని రాయించారు.ఇదే నరేంద్రమోదీ తిరుపతిలో సభ పెట్టి హోదా పదేళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు..ఎన్నికలయ్యాక ఇదే బీజేపీ పార్టీ మోసం చేసింది..ఇవ్వగలిగే స్థాయిలో ఉండికూడా ఇదే బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసిన పరిస్థితిని ప్రతి గ్రామంలోనూ చెప్పండి..

ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పండి..బీజేపీకు ఓటేయండి..చంద్రబాబుకు ఓటేయండి..వీళ్లతో నేను చేయిస్తానని చెప్పిన సంగతి చెప్పండి..ఎన్నికలయిపోయాయి. నాలుగేళ్లు ఆ ఇద్దరితో సంసారం చేసి…ఇదే పవన్ కళ్యాణ్  ఎన్నికలొచ్చేసరికి కారణాలు చెబుతాడు. వీళ్లంతా దోషులే అని చెప్పండి…అంటూ కార్యకర్తలకు..బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు జగన్.

Spread the love
 • 559
 •  
 •  
 •  
 •  
 •  
  559
  Shares
 •  
  559
  Shares
 • 559
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.