అలీకు జగన్ ఇచ్చిన ఆ హామీ ఏంటి….

అదీ నాయకుడి లక్షణమంటే…

అలీకు నచ్చింది కూడా అదే…

ఎన్నికల దగ్గరపడే కొద్దీ రాజకీయాలు , వలసలు ఊపందుకుంటాయి పార్టీల్లో. అయితే వలస నేతల్ని, ప్రముఖుల్ని ఆకర్షించడానికి అప్పటికప్పుడు హామీలిచ్చేవాళ్లనే చూశాం. కానీ ఉన్నది ఉన్నట్టు…విస్పష్టంగా చెప్పి మరీ ఆ నేతల్ని ఆకట్టుకోవడమంటే మాటలు కాదు. మాట ఇస్తే తప్పకూడదనే సిద్ధాంతాన్ని గానీ, నమ్మి వచ్చినవారిని మోసం చేయకూడదనే విధానాన్ని గానీ పూర్తిగా నమ్మేవ్యక్తి జగన్. అందుకే అలీతో కూడా అదే చెప్పాడు. జగన్ లోని ఆ వైఖరి అలీకు కూడా నచ్చింది.

అందుకే ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో లోటస్ పాండ్ లో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలీ వెంట మరో నటుడు కృష్ణుడు ఉన్నారు. నేటి నుంచి అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారు.

జగన్ అలీకిచ్చిన హామీ ఏంటి..చెప్పిన ఆ మాటేంటి…

ఎన్నికల్లో సీటు విషయంలో జగన్ చెప్పిన సమాధానం తనకు నచ్చిందన్నారు అలీ. పాదయాత్ర  సమయంలో కొంతమందికి కొన్ని స్థానాల్లో మాటిచ్చాను..నన్ను నమ్మి పార్టీలోకి నీవొచ్చినట్టే…వాళ్లు కూడా వచ్చారు. వాళ్లను ఇప్పుడు కాదంటే చెడుగా ఉంటుంది…అందుకే పార్టీలోకి మనస్పూర్తిగా వచ్చి పనిచేయ్….నీ సంగతి నా కొదిలేయ్.. నేను చూసుకుంటానంటూ జగన్ అలీకు మాటిచ్చారు. జగన్ లోని ఆ స్పష్టమైన వైఖరే అలీకు నచ్చింది. తన కోసం ఎవరో మరొకరికి మోసం చేయడం ఇష్టం లేదని తన ముందే చెప్పడం జగన్ లోని నిజాయితీకి నిదర్శనమని అలీ అన్నారు. పార్టీ ఆదేశించిన ప్రకారం ప్రచారం ప్రారంభిస్తానన్నారు అలీ. తన వంతు కష్టపడి జగన్ ను సీఎం చేసుకుందామన్నారు. పాదయాత్రలో జగన్ అంటే ఏంటో ప్రజలు చూశారని..జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు అలీ. పార్టీ ఎక్కడి నుంచైనా టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నా చేస్తానన్నారు.

వైసీపీలో చేరిన దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్..

మరోవైపు టీడీపీ సీనియర్ నేత  మంత్రి దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ తో కలిసి వచ్చిన చంద్రశేఖర్ కు జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ పూర్తిస్థాయి అవినీతిలో కూరుకుపోయిందని…కేసుల నుంచి టీడీపీను ఎవరూ కాపాడలేరని చంద్రశేఖర్ ఆరోపణలు గుప్పించారు. ఆ అవినీతి భరించలేకే తాను వచ్చేశానన్నారు.

for the same video please click the below link and watch…

Spread the love
 • 1.5K
 •  
 •  
 •  
 •  
 •  
  1.5K
  Shares
 •  
  1.5K
  Shares
 • 1.5K
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.