ఎన్నిదశలు…ఎప్పుడెప్పుడు ఎన్నికలు..

ఏడు దశల్లో పోలింగ్…

ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ పోలింగ్ తేదీలు…23న కౌంటింగ్…

17వ లోక్ సభ, నాలుగు రాష్ట్రాల ఎన్నికలు…

కేంద్ర ఎన్నికల కమీషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ , ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా రాష్ట్రాల ఎన్నికల్ని నిర్వహించడానికి షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ముఖ్య ఎన్నికల అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు.

2014తో పోలిస్తే ఈసారి  ఓటర్ల సంఖ్య దాదాపు 9 కోట్లు పెరిగిందని..ఈసారి మొత్తం 90 కోట్ల ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల సంఘం తెలిపింది. గత ఎన్నికల్లో 9 లక్షల పోలింగ్ స్టేషన్ లుంటే..ఈసారి 10 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా..అన్ని చోట్ల వీవీప్యాట్ లను వినియోగిస్తామని ఈసీ ప్రకటించింది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది.

ఎన్ని దశలు..ఎప్పుడు…ఎన్ని స్థానాలు…

ఫేజ్-1 ఏప్రిల్ 11 , ఫేజ్-2 ఏప్రిల్ 18, ఫేజ్-3 ఏప్రిల్ 23, ఫేజ్-4 ఏప్రిల్ 29, ఫేజ్-5 మే 6, ఫేజ్-6 మే 12, ఫేజ్-7 మే 19 తేదీల్లో పోలింగ్ జరపడానికి ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేసింది. ఫేజ్ -1లో 91 స్థానాలు, ఫేజ్-2లో 97, ఫేజ్-3లో 15, ఫేజ్-4లో 71, ఫేజ్-5లో 51, ఫేజ్-6లో 59, ఫేజ్-7లో 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏ రాష్ట్రాలు ఎన్ని దశలు…

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తెలంగాణా, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, ఢిల్లీ, పాండిచ్చేరి, చండీగఢ్ మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకేదశలో పోలింగ్ జరగనుంది. ఇక రెండు దశల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. అస్సాం, ఛత్తీస్ గడ్ లలో మూడు దశల్లోనూ… జార్ఘండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సాలలో 4 దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్ లో 5 దశల ద్వారా, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లలో 7 దశల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు తొలిదశల్లో అంటే ఏప్రిల్ 11నే  ఎన్నికలు పూర్తి చేసుకోనుండగా…తమిళనాడులో ఏప్రిల్ 18న ఎన్నికలు పూర్తి కానున్నాయి. కర్నాటకలో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.  కాగా…మే 23వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Spread the love
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares
 •  
  16
  Shares
 • 16
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.