ఎన్నికల షెడ్యూల్ విడుదల…నెలలోనే ఏపీ, తెలంగాణా ఎన్నికలు

ఏడు దశల్లో పోలింగ్…

తొలిదశలో  ఏప్రిల్ 11న ఏపీ , తెలంగాణా ఎన్నికలు…

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం అస్సలు సమయం ఇవ్వలేదు. కేవలం ఓ నెల వ్యవధిలో ఏపీ, తెలంగాణా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఎన్నికల కమీషన్…ఆంధ్ర, తెలంగాణా ఎన్నికల్ని తొలిదశలో నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణా లోక్ సభలకు ఏప్రిల్ 11వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రా , తెలంగాణా ఎన్నికల షెడ్యూల్….

…………………………………………………………………………………………

గెజిట్ నోటిఫికేషన్…..18 మార్చ్ , 2019

నామినేషన్లు దాఖలుకు ఆఖరు తేదీ….25 మార్చ్, 2019

స్క్రూటినీ…..26 మార్చ్ , 2019

ఉపసంహహణ…..28 మార్చ్, 2019

పోలింగ్….11 ఏప్రిల్, 2019……ఫలితాలు 23 మే, 2019

…………………………………………………………………………………………….

దేశవ్యాప్తంగా మొత్తం పది లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 90 కోట్ల ఓటర్లు ఇప్పటివరకూ లెక్కతేలారని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. 17వ లోక్ సభతో పాటు  ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అన్ని ప్రాంతాల్లోనూ వీవీప్యాట్ లను వినియోగించనున్నామని ఈసీ తెలిపింది.

Spread the love
 • 74
 •  
 •  
 •  
 •  
 •  
  74
  Shares
 •  
  74
  Shares
 • 74
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.