రిలయన్స్ ఇంట ఘనంగా పెళ్లి…

ఆకాశ్ వెడ్స్ శ్లోకా…

ఆయిల్ కింగ్ తో డైమండ్ కింగ్ బంధుత్వం…

గత ఏడాది రిలయన్స్ దిగ్గజం మకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ముకేష్ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మరింత ఘనంగా జరిగింది. డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురైన శ్లోకా మెహతాతో ఆకాశ్ పెళ్లి అత్యంత వైభవోపేతంగా జరిగింది.

రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో ముంబైలోని  బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న జియో వరల్డ్ సెంటర్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. తొలుత ముకేష్, నీతా అంబానీలతో పాటు వరుడు ఆకాశ్ లు ధీరూబాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శనివారం రాత్రి 8న్నర గంటల తరువాత వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటులు షారుఖ్ కాన్ , రణబీర్ కపూర్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లాలు సందడి చేశారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్సి బాన్ కీ మూన్ దంపతులు, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లేయర్ దంపతులు, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇంకా రజనీకాంత్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, అభిషేక్, అమితాబ్, అమీర్ ఖాన్, రతన్ టాటా, సచిన్, టైగర్ ష్రాఫ్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, యువరాజ్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇషా అంబానీ వివాహం లానే…ఆకాశ్ వివాహం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఎవరెవరు వచ్చారు..ఎలా జరిగింది..అలంకరణ ఎలా ఉంది…అనే అంశాలపై చర్చ రచ్చరచ్చగా జరుగుతోందని సోషల్ మీడియా కూస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.