వైసీపీలో చేరికలకు కారణమిదే….

జగన్ వద్ద ఉన్న మిగిలిన అస్త్రాలేంటి…

రాజకీయాలంటే పొత్తులు కాదు..పోరాటమే…

నాడూ-నేడూ ఒంటరిగానే పోరాటం…

చావో రేవో తేల్చుకునే ఎన్నికలకు మరి కొన్ని రోజుల వ్యవధి మిగిలుంది. గత ఎన్నికల్లో తృటిలో తప్పిన విజయాన్ని ఈసారి మిస్ చేసుకోకూడనుకున్నారు వైఎస్ జగన్. అన్ని విధాలా సన్నద్ధం కావడానికి పూర్తిగా సంసిద్ధమైపోయారు. ఒక్కో అస్త్రాన్ని బయటకు తీసే కొద్దీ ప్రత్యర్ధి బెంబేలెత్తుతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలి కాలంలో పెద్దఎత్తున వచ్చి చేరుతున్న నాయకులే అందుకు కారణం.

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో…తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. మరి కొద్దిమంది నేతలైతే వైసీపీ తరపున గెల్చిన అనంతరం ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. నాడు అధికారపార్టీకు..వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు తేడా కేవలం 5న్నర లక్షల ఓట్లే. జగన్ నిజంగా మొండోడే. ఎందుకంటే పొత్తులపై అతనికి నమ్మకం ఉండదు. జగన్ కు నిజంగా ఆత్మస్థైర్యం ఎక్కువే. ఎందుకంటే అతనికి తమపై నమ్మకం ఎక్కువ. జగన్ కు ఒంటరి పోరంటేనే ఇష్టం. ఎందుకంటే్ మరొకరి సహాయం తీసుకోవడం అతనికిష్టం ఉండదు. రాజకీయాలంటే పొత్తులు కాదు..రాజకీయాలంటే పోరాటమని పూర్తిగా నమ్మిన వ్యక్తి. అందుకే ఎవరెన్ని చెప్పినా అనుకున్నదానికి..చెప్పినదానికి కట్టుబడి రాజకీయం సాగిస్తున్నాడు. పార్టీలోకి వచ్చేవాళ్లు రాజీనామాలు చేసి రావాలన్న కొత్త సాంప్రదాయానికి తెరదీసి..విలువల్ని పాటిస్తున్నవాడు. అందుకే నాడు బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసినా ఒంటరిగా ఢీ కొట్టాడు. ఇప్పుడూ అంతే. జనసేన-టీడీపీ రహస్య పొత్తులతో ఎన్నికలకు సిద్ధమౌతున్నా…బీజేపీ, కాంగ్రెస్ లు పోటీలో ఉన్నా సరే…ఒంటరిగానే పోటీ అన్నాడు. అదే జగన్ కు బలం కూడా.

టీడీపీ కేడర్ ను మానసికంగా దెబ్బతీస్తున్న జగన్ వ్యూహం…

ప్రజా సంకల్పయాత్ర అందించిన విజయంతో ఎలక్షనీరింగ్ పై దృష్టి సారించారు జగన్. సమర శంఖారావం, తటస్థులతో సమావేశాలతో అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. మరోవైపు ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీయడానికి అస్త్రాల్ని సంధిస్తున్నాడు. పార్టీకు ప్రజల్లో ఉన్న ఆదరణ, అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలో ఆ నేతల బలాబలాల్ని మాత్రమే కాకుండా ప్రజల్లో వారికున్న పట్టును అంచనావేసి ఆహ్వానం పలుకుతున్నారు జగన్. కడప నుంచి మేడా మల్లికార్ఝునరెడ్డి, చీరాల నుంచి ఆమంచి, ప్రకాశం జిల్లా నుంచి దగ్గుబాటి, కృష్ణాజిల్లా నుంచి దాసరి జై రమేష్ , దాసరి బాలవర్ధనరావు, గుంటూరు నుంచి నార్నే శ్రీనివాసరావు, పశ్చిమ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు, తూర్పు నుంచి పండుల రవీంద్ర, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్ లు, కర్నూలు నుంచి చల్లా రామకృష్ణారెడ్డిలు చేరగానే అయిపోలేదు. గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, విశాఖ నుంచి దాడి వీరభద్రరావులు సైతం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయం కదా…చేరికలు సహజమని అనుకుంటే పొరపాటే. ఎన్నికల సమయం కాబట్టే… ఓ బలమైన నాయకుడు పార్టీని వీడితే కార్యకర్తలు నిస్తేజంలో పడిపోతారు. ఆ నిస్తేజం నుంచి తేరుకోకపోతే పార్టీకు తీరని నష్టం కలుగుతుంది. జగన్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రత్యర్ధిని పూర్తిగా దెబ్బతీయడానికి చేరికల అస్త్రాన్ని పూర్తిగా అనుకూలంగా మల్చుకుంటున్నారు. మరోవైపు డేటా చోరీ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికార పార్టీని పూర్తిగా ఇరకాటంలో పెట్టగలిగారు. ప్రస్తుతం ఆ పార్టీకు డేటా చోరీ విషయాన్ని డిఫెన్స్ చేసుకోవడంతోనే సమయం గడిచిపోతోంది.  ఇక కేడర్ ను ఎలా కాపాడుకుంటుంది.

ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏలూరు నుంచి మాగంటి బాబు, కావూరి సాంబశివరావు, కర్నూలు నుంచి ఎస్పీవై రెడ్డి వంటి కీలకమైన ఇతర నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. ఈసారి కచ్చితంగా పార్టీ అధికారంలో వస్తుందన్న భారీ అంచనాలు, విశ్లేషణలు, సర్వేల వల్లనే పార్టీలో చేరికలు ఎక్కువవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Spread the love
 • 588
 •  
 •  
 •  
 •  
 •  
  588
  Shares
 •  
  588
  Shares
 • 588
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.