మహేశ్ కు రష్మికానే ఫైనల్ అయిందా….

మహేశ్ తో మరో కామెడీ టైమింగ్ సినిమా….

అనిల్ రావిపూడి దర్శకత్వంలో…రష్మిక సరసన…

దూకుడు సినిమా తరువాతే మహేశ్ లోని కామెడీ ఎంటో అందరికీ తెలిసింది. టైమింగ్ కామెడీతో జనాన్ని ఆకట్టుకున్నాడు. స్క్రిప్ట్ ను బట్టి ఇదే జోరును ఆ తరువాత కూడా మహేశ్ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ -2తో మంచి కామెడీ జనానికి అందించారు. సో..ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఇందులో ఫన్ కు పెద్దపీట వేశారని తెలుస్తోంది.

మరి అటువంటి మూవీకోసం కధానాయికగా ఎవర్ని ఎంచుకున్నారన్నదే అసలు ఆసక్తి కలిగించే విషయం. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ గా సాయిపల్లవి, కత్రినా కైఫ్, రష్మికా మండన్నా పేర్లు విన్పిస్తున్నాయి. అయితే అందరికంటే ఎక్కువగా…అవకాశాలు మాత్రం రష్మికా మండన్నాకే ఉన్నాయి. మిగిలిన ఇద్దరి కంటే రష్మికా రేసులో ముందున్నారని సమాచారం. మహేశ్ సరసన ఈ కొత్త సిినిమాకు రష్మికానే దాదాపుగా ఖరారయ్యారట.

ప్రస్తుతానికి మహర్షి సినిమాతో బిజీగా ఉన్న మహేశ్…అనంతరం కొత్త సినిమా షూట్ కు వెళతారు. మహర్షి సిినిమా  మే 9 న వేసవిలో విడుదల కానుంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.