డాటా చోరీ సంస్థతో సీఎం, లోకేష్ లకు సంబంధాలు..?

పోలీసుల విచారణలో కీలక ఆధారాలు…

ఐటీ గ్రిడ్స్, బ్లూ ప్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం నుంచి కోట్ల విలువైన కాంట్రాక్టులు…

ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న టీడీపీ…

యాప్ పనితీరును లోకేష్ కు వివరిస్తున్న ఐటీ గ్రిడ్ ప్రతినిధులు

రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిన డాటా చోరీ ఉదంతం వెనుక నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణా పోలీసులు తీగ లాగే కొద్దీ డొంకంతా బయటపడుతోంది. ఈ చోరీ వ్యవహారానికి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్, బ్లూ ప్రాగ్ కంపెనీ ప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి, నారా లోకేష్ లతో సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. బహుశా ఆ సంబంధాల నేపధ్యంలోనే…ఎటువంటి అనుభవం లేని ఆ సంస్థలకు ఏపీ ప్రభుత్వం కోట్ల విలువైన కాంట్రాక్టుల్ని కట్టబెట్టింది.

ఏపీ పంచాయితీ రాజ్ శాఖ నుంచి కుటుంబ వికాసం, సమాజ వికాసం ప్రాజెక్టును బ్లూ ఫ్రాగ్ సంస్థకు దక్కగా…30 కోట్ల విలువైన పంటల సలహా కాంట్రాక్ట్ ను బ్లూ ఫ్రాగ్ సంస్థకు వచ్చింది. కరెంట్ స్థంభాల జియో ట్యాగింగ్ కాంట్రాక్ట్ కూడా ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. గత ఎన్నికల్లో ఈ రెండు సంస్థలు తెలుగుదేశం పార్టీకు సాంకేతిక సేవలు కూడా అందించాయి.

డాటా చోరీ వ్యవహారం బయటకు రావడం, తీగలాగే కొద్దీ డొంకంతా వెలుగు చూస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నట్టు తెలియడంతో ఆ పార్టీ యంత్రాంగం ఉలిక్కిపడింది. కోట్లాదిమంది వ్యక్తిగత సమాచారాన్ని ప్ర్రైవేటు కంపెనీలకు లీకు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఆ పార్టీ వెంటనే ఉన్నపళంగా…తమ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. దీనికి కారణాలు లేకపోలేదు. కోర్టు తీర్పు ప్రకారం ప్ర్రైవేటు వ్యవహారాల కోసం ఆధార్ ను అనుసంధానించకూడదు. కానీ టీడీపీ తాము చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమమంతా ఓటర్ల జాబితా, ఆధార్ నంబర్లతో జరిగింది.

ఆన్ లైన్ సభ్యత్వ కార్యక్రమాన్ని మూసేసిన తెలుగుదేశం పార్టీ

పోలీసుల విచారణలో కీలక ఆధారాలు…

అమెజాన్ సంస్థకు నోటీసులు…

తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో  చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభ్యమైనట్టు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్ లో సోదాలు నిర్వహించామని తెలిపారు. సంస్థకు చెందిన ఉద్యోగుల  సమక్షంలో సోదాలు నిర్వహించి..కీలకమైన ఎలక్ట్రానికి డివైస్ లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్నారు. మరీ ముఖ్యంగా సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు సోదాల్లో లభించాయని కమీషనర్ స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్‌ డేటా అమెజాన్‌ సర్విస్‌లో భద్రపర్చినట్టు విచారణలో తేలిందన్నారు. నియోజకవర్గాల వారిగా ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డ్‌ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వేసెస్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.

సేవామిత్ర-తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్

అసలేం జరిగింది…

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమచారం చోరీ అయినట్టు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన సైబరాబాద్  పోలీసులకు నిర్ఘాంత పోయే నిజాలు తెలిసాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన కాంట్రాక్టులు పొందడమే కాకుండా..టీడీపీ అధికారిక సేవామిత్ర యాప్ ను తయారుచేసిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డాటా చోరీ చేసినట్టు తేలింది. మరో సంస్థ బ్లూ ఫ్రాగ్ ఈ తెలుగు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థకు అందించినట్టు విచారణలో తెలిసింది. ఈ డాటాలో ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్ ఖాతాలు, ఓటర్ ఐడీ నెంబర్లున్నాయి. అంతేకాకుండా డాటా సేకరణ కోసం అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ సంస్థకు అందేలా ఏపీ ప్రభుత్వమే యాక్సెస్ ఇచ్చిందని సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది.  రానున్న ఎన్నికల్లో నెగ్గడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈ డాటా సహాయంతో అడ్డదార్లు తొక్కడానికి సిద్ధమైందని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా ప్రభుత్వం వాడుకుంటోందని..ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతి రేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించడానికి, ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేయడానికి కుట్ర జరుగుతోందని ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పధకాల లబ్దిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా వ్యక్తుల కలర్ ఫోటోలతో సహా బ్లూ ఫ్రాగ్ సంస్థ భద్రపర్చింది. వాస్తవానికి ఈ సమాచారం జిల్లా కలెక్టర్ల పరిధిలో భద్రంగా ఉండాలి. ఆఖరికి నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు, పోలీసులకు కూడా ఈ డేటాబేస్‌లోకి యాక్సెస్‌ ఇవ్వకూడదు. అటువంటిది ప్రభుత్వం నేరుగా యాక్సెస్ కు బ్లూ ఫ్రాగ్ సంస్థకు  అనుమతించింది. దీంతో ప్రభుత్వ అధికారుల పాత్ర (ఐపీసీ 188) కూడా ఉందని.. చోరీ(ఐపీసీ 370) ద్వారానే డేటా సంగ్రహించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

for more details…watch the video….

మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి…

 

Spread the love
 • 33
 •  
 •  
 •  
 •  
 •  
  33
  Shares
 •  
  33
  Shares
 • 33
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.