బాహుబలి-2ను మించిపోయిన ఉరీ…

ఉర్రూతలూగిస్తున్న ఉరీ…ది సర్జికల్ స్ట్రైక్..

బాహుబలి-2 ను మించిన వసూళ్లు…

ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ విషయంలో బాహుబలి-2 రికార్డును అధిగమించేసింది. ఇప్పటివరకూ హిందీలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి-2 కు రికార్డు ఉంది. అయితే బాహుబలి -2 చిత్రం 23, 24 రోజుల్లో సాధించిన వసూళ్లను ‘ఉరీ’ చిత్రం అధిగమించింది. బాహుబలి-2 సినిమా 23వ రోజు కలెక్షన్స్ 6 కోట్ల 35 లక్షలు  కాగా, 24వ రోజు 7 కోట్ల 80 లక్షలు వసూలు చేసింది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఉరీ చిత్రం మాత్రం 23వ రోజు 6 కోట్ల 53 లక్షలు, 24వ రోజు 8 కోట్ల71  లక్షలు వసూలు చేసింది. అంతేకాదు సినిమా  ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో బాహుబలి-2 పేరిట ఉన్న మరిన్ని రికార్డుల్ని కూడా ఈ సినిమా అధిగమించేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ మూవీ 45 కోట్లతో రూపొందింది. 2016లో భారత సైన్యం పాకిస్థాన్‌పై జరిపిన మెరుపు దాడుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 281 కోట్ల 73  లక్షలు రాబట్టినట్లు సమాచారం. బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా  ఒక వేయి 810 లక్షలు రాబట్టింది. ఉరీ చిత్రంలో హీరో విక్కీ కౌశల్‌తో పాటు పరేశ్ రావల్, రజిత్ కపూర్, యామీ గౌతమ్, కృతి కుల్హరి కీలక పాత్రల్లో నటించారు. ఈ  సినిమాను రోనీ స్కూవాలా నిర్మించగా…ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.