సెక్సీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల ఓటు మిస్…

సెక్సీ బ్యాడ్మింటన్ గుత్తాజ్వాల ఓటు మిస్…

ఎన్నికల అధికార్ల నిర్లక్ష్యంపై వరుస ట్వీట్లు…

తెలంగాణా ఎన్నికల పోలింగ్ లో ఓటు గల్లంతు సంఘటనలు అధికంగా కన్పించాయి. సామాన్యులే కాదు..ప్రముఖుల ఓట్లు కూడా మిస్ అయిపోయాయి. ఇదే కోవలోకి వచ్చారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.

నా ఓటు పోయింది. ఆన్ లైన్ ఓటరు జాబితాలో నా పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానంటూ గుత్తా జ్వాల చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. అంతటితో ఆగకుండా ఎన్నికల అధికార్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ…వరుస ట్వీట్లు కూడా చేశారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియదంటూ ఆవేదన చెందారు.

ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరిగినట్లని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తా ట్వీట్ల నిరసనకు చాలామంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తమపేర్లు కూడా గల్లంతయ్యాయని ట్వీట్‌ చేశారు.

Spread the love
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 •  
  5
  Shares
 • 5
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.