డీఎస్సీ పరీక్షలు వాయిదా…

ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా…

అభ్యర్దుల విజ్ఞప్తి మేరకు మరో రెండు వారాల గడువు..

డిసెంబర్ లో ప్రారంభం కావాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలకు…డీఎస్సీ ప్రకటనకు వ్యవధి చాలా తక్కువగా ఉన్నందున ప్రిపేర్ అయ్యేందుకు గడువు ఇవ్వాలన్న అభ్యర్దుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అభ్యర్దుల నుంచి వచ్చిన విజ్ఞప్తి అనుసరించి ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు వాయిదా పడటంతో కొత్త షెడ్యూల్ ను నేడు ప్రకటించే అవకాశముంది. మొత్తం 7 వేల 729పోస్టులుండగా..6 లక్షల 8 వేల 157 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వాయిదా పడిన నేపధ్యంలో పరీక్షా కేంద్రాల ఎంపిక సమయం కూడా మారనుంది. మరోవైపు పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున పెంచాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది.

 

Spread the love
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 •  
  5
  Shares
 • 5
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.